Breaking News

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెంగల్ తుఫాన్ గా మారిన నేపథ్యంలో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి…

-అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు
-కాజ్వేలు,వంకలలో నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దు
-ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది
-జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల,డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం పెంగల్ తుఫాన్ గా మారిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ప్రయాణాలు చేయవద్దని, కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్న సందర్భంలో పొరపాటున కూడా దాటరాదనీ, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ, పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలుపుతూ జిల్లా కేంద్రంలో, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసామని, సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో, పట్టణాలలో పర్యటించి డ్రెయిన్లు ఎక్కడైనా బ్లాక్ అయిన వాటిని క్లియర్ చేయడం, ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అధికారులందరూ 24/7 వారి ప్రధాన కార్యస్థానం నందు అందుబాటులో ఉండాలని తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని సూచించారు. కోస్తా తీర ప్రాంతాలైన గూడూరు డివిజన్ కోట, చిల్లకూరు, వాకాడు మండలాలు, సూళ్లూరుపేట డివిజన్ నందు తడ తదితర మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.

చెరువులు, కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

కాజ్ వే లపై నీరు ప్రవహిస్తుంటే దాటడానికి అనుమతించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, ఆర్ అండ్ బి పంచాయితీ రాజ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎలాంటి విపత్తును అయినా ఎదుర్కునేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని, భారీ వర్షాల నేపథ్యం లో తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని ఏదైనా సహాయం, సమాచారం కోసం క్రింది నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.

కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007

గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 8624252807

సూళ్లూరుపేట ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 8623295345

తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040

శ్రీకాళహస్తి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 8555003504

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *