Breaking News

కలక్టరేట్ లో ప్రతి సోమవారం ఆధార్ నమోదు , నవీకరణ కేంద్రం

-జిల్లా అభివృద్ది అధికారి పి. వీణాదేవి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు జిల్లా వ్యాప్తంగా వివిధ అర్జికి అందజేసేందుకు వొచ్చే ప్రజల కోసం ఆధార్ కేంద్రం ను నిర్వహించనున్నట్లు జిల్లా అభివృద్ది అధికారి పి. వీణా దేవి తెలియ చేశారు. సోమవారం ఉదయం కలక్టరేట్ లో ఆధార్ కేంద్రం ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వీణాదేవి వివరాలు తెలియ చేస్తూ, జిల్లా వ్యాప్తంగా 102 గ్రామ సచివాలయాలలో ఆధార్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాంకేతిక పరమైన ఇబ్బందులూ లేకుండా ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులు జిల్లా కేంద్రంలో అందుబాటు లో ఉంచి సమస్యలను పరిష్కారం చేస్తున్నట్లు వీణా దేవి తెలిపారు.

మండలాలు వారీగా అందుబాటులో ఉంచిన ఆధార్ కిట్స్  సంఖ్య చాగల్లు 4 , దేవరపల్లి 3 , గోపాలపురం 3 , కొవ్వూరు రూరల్ 5 , కొవ్వూరు అర్బన్ 1 ,  నల్లజర్ల 5 , నిడదవోలు రూరల్  4 , నిడదవోలు అర్బన్ 1 ,  పెరవలి 5 ,  తాళ్లపూడి 3 ,  ఉండ్రాజవరం 4  , అనపర్తి – 5 బిక్కవోలు 5 , గోకవరం 4  , కడియం 5 ,  కోరుకొండ 5 , రాజమండ్రి రూరల్ 7 , రాజమండ్రి అర్బన్ 17, రాజానగరం 7 , రంగంపేట 5 ,  సీతానగరం లో 4 కిట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఆధార్ సేవలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందులో భాగంగా కొత్త ఆధార్ కార్డు నమోదు , తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణ (వయస్సు 5-7 మరియు 15-17) , డెమోగ్రాఫిక్ అప్‌డేట్ ,(చిరునామా ఫోన్ నెంబర్, పేరులో తప్పులు తదితర వివరాలు) , చేతి వేలి ముద్రలు నవీకరణ (బయో మెట్రిక్ అప్‌డేట్) , డాక్యుమెంట్ నవీకరణ (2011 నుండి 2016 మధ్య ఆధార్‌ను నమోదు చేసుకున్న వారు) వంటి సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *