-రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు..
-గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సులు కీలకపాత్ర పోషిస్థాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి, డిసెంబర్ 10: రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా జరుగుచున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి మంగళవారం తిరుపతి జిల్లాలో చంద్రగిరి శాసనసభ్యులు పులిపర్తి నాని పాకాల మండలం వల్లివేడు గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా కాలంగా పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరించుకొనుటకు చక్కటి అవకాశం అని తెలిపారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బోనుపల్లి గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని మారుమూల ఉన్న ప్రాంత వాసులకు రెవెన్యూ సదస్సులు ఒక గొప్ప సువర్ణవకాశమని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా భూమి, రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ చిల్లకూరు మండలం గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని, రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ అవకాశాన్ని సదరు గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు తెలిపారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 49 గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో స్థానిక శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు తిరుపతి జిల్లాలో మొదటి రోజు నుండి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 3919 అర్జీలు అందాయని అందులో నేడు 1046 అర్జీలు వచ్చాయని అందులో రీ సర్వే పై -48, ఫామ్ 22 ఏ పై -15, హౌస్ సైట్స్ పై 249, ఆర్ ఓ ఆర్ పై -507, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ పై -73, ఇతర విషయాల సంబంధించి – 12 అర్జీలు వచ్చాయని తెలిపారు. కొన్నిసమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించబడ్డాయని, మిగిలిన అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
Prajavartha Online Telugu News