Breaking News

ఘనంగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ఏర్పాట్లు

-పర్యవేక్షించిన మంత్రి కొలుసు పార్థసారథి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొట్టి శ్రీరాములు బలిదానం చేసిన డిసెంబర్ 15 వ తేదీన ఆయన గౌరవార్థం ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.విజయవాడ లోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత ప్రభుత్వాధికారులతో కలిసి మీడియా, గ్యాలరీ , సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి కోలుసు పార్థసారథి పర్యవేక్షించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా ప్రభుత్వం ప్రకటించిందని ఆదివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా, సబ్ కలెక్టర్ కావూరి చైతన్య, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *