Breaking News

రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ధాన్యం సేకరణ సక్రమంగా జరగడంలేదని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నా పూర్తిగా విఫలమైందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మాట్లాడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాలని కాలయాపన చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వం హయాంలో పాలన మొత్తం దోపిడీమయం చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని, అప్పుడు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగిపోతుందని ధర్నాలు చేపట్టటం విడ్డూరంగా ఉందన్నారు.
రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి కనీస మద్దతు ధర కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, గత ప్రభుత్వం హయాంలో విధంగా కాకుండా మిల్లులకు ధాన్యం చేరిన 48 గంటల్లోనే వారి ఖాతాలకు నగదు జమ చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యాన్ని దోచుకుని పత్తా లేకుండా పారిపోయారని, ఆనేక మంది ఆ పార్టీ కి చెందిన నాయుకులు అవనీతి, అరాచకాలకు అంతే లేకుండా పోయిందిని,అలాంటివారు కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించటం విడ్డూరంగా ఉందని మంత్రి దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆరు నెలలు గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రజలకు మంచి పాలనను అందిస్తున్నామని మంత్రి పార్ధ సారధి తెలిపారు. గత ప్రభుత్వంలోని తప్పు జరిగిందని, ఇప్పటికీ పార్టీ నాయకత్వంలో మార్పు రానందున,ఆ పార్టీకి చెందిన నాయుకులు ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తామని మంత్రి తెలిపారు.
మంత్రి రవీంద్ర కుటుంబానికి పరామర్శ
రాష్ట్ర గనులు శాఖ మంత్రి కొల్లు.రవీంద్ర కుటుంబ సభ్యులను మంత్రి పార్ధ సారధి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు వెంకట రమణ మరణించారు.వెంకట రమణ చిత్ర పటానికి పూల మాల వేసి మంత్రి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆర్.కృష్ణ యాదవ్,ఇతర నాయుకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *