విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం లోని పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. 48వ డివిజన్ ఆళ్ల నాగయ్య వీధిలో రూ 31 లక్షల 95 వేలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు.49 వ డివిజన్ పరిధిలో వీరయ్య వీధి కొండ ప్రాంతం లో రూ 37 లక్షల 57 వేలతో రిటైనింగ్ వాల్ పనులు, నన్నే సాహెబ్ వీధిలో రూ 19. 95 వేలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ ను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పురపాల శాఖ మంత్రి నారాయణ పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అభివృద్ధి పనులు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుల్లా విజయ్, అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు, మరుపిళ్ళ రాజేష్, మహాదేవు అప్పాజీరావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, (చంటి)మైలవరపు దుర్గారావు, అర్షద్, బడుగు వెంకన్న, పల్లె పోగు ప్రసాద్, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News