గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది.
గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ (SEEDAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 09-01-2025 వ తేదీన గుంటూరు జిల్లలో రెండు ప్రదేశాలలో, తెనాలి మరియు గుంటూరు వెస్ట్ నందు జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలకు 10 కంపెనీలు వారు హాజరయ్యారు, ఈ జాబ్ మేళాల కి 243 మంది రిజిష్టర్ చేసుకోగా గుంటూరు వెస్ట్ నందు 47 మంది మరియు తెనాలి నందు 26 మంది, రెండు జాబ్ మేళాలకు గాను 73 మంది ఉపాధి పొందినారని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన గుంటూరు జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దుర్గాబాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎస్.ఎస్.డి.సి ఎంప్లాయిమెంట్ సీడప్ మరియు కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …