విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ పార్టీతో కలిసి ఉన్న ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉంటారు అని అన్నారు.
ప్రపంచ శాంతి కోసం ఆత్మకూరు నందు నిర్వహించిన తబ్లిగి జమాత్ ఆధ్యాత్మిక 3రోజుల కార్యక్రమం నందు దాదాపు 3.5లక్షల మంది పాల్గొని అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
ఈ తబ్లిగి జమాత్ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కర్నూలు కార్యక్రమం కొరకు 10కోట్లు కేటాయించినట్టు ఈ సారి కూడా 2కోట్ల రూపాయలు నిధులు కేటాయించి సీఎం ముస్లింల పక్షపాతి అని మరో సారి నిరూపించుకున్నారు అని అన్నారు. ప్రత్యేక చేరువ చూపిన మైనారిటీ & న్యాయ శాఖ మంత్రి పెద్దలు NMD ఫరూక్, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ & యంత్రాంగం, జిల్లా ఎస్పీ మరియు పోలీసు అధికారులు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తబ్లిగి జమాత్ ఆధ్యాత్మిక సభ నిర్వాహకులు సైతం చాలా చక్కగా, ప్రశాంతమైన వాతావరణంలో, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమావేశం నిర్వహించటం పట్ల ఫరూక్ షిబ్లీ వారికి కూడా అభినందనలు తెలియజేశారు.