విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం పుణ్యప్రదం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం పుణ్యప్రదమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ధనుర్మాసం సందర్భంగా ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయి మందిరానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆధ్మాత్మికత వాతావరణం నెలకొంది. వేదిక మీద‌ పెద్ద శేష వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీవారి ప్ర‌తిమ‌ను కొలువు దీర్చి రమేష్, జ్యోతి దంపతులు మంగ‌ళ‌హార‌తి స‌మ‌ర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సకల చరాచర సృష్టికి మూలం పరమాత్మ స్వరూపమేనని, అలాంటి పరమాత్మను మనసా వాచా కర్మనా త్రికరణ శుద్ధిగా పూజించాలన్నారు. ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పట్టించడం వలన విశేష ఫలితాలు సిద్ధిస్తాయని తెలిపారు. శ్రీ మహా విష్ణువు యొక్క ప్రతి పేరుకు లోతైన అర్థం ఉంటుందని.. ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వాళ్ళు భగవంతుని అనుగ్రహంతో సకల శుభాలను, సంపదలను పొందుతారని వివరించారు. కనుక ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వారంలో ఒక రోజైనా ఆలయానికి వెళ్లడం, తమ ఇంట్లో భగవన్నామ స్మరణ, సహస్ర నామ స్తోత్రాలు పారాయణం చేయడం పుణ్యప్రదమని తెలియజేశారు. మందలపర్తి సత్యశ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, కొప్పరపు మారుతీ, యల్లాప్రగాఢ సుధీర్, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *