విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ విజయ ఫార్మసీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానం చేసి స్వామి వివేకనంద యొక్క జీవిత విశేషాలను వారికి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకర రాము మాట్లాడుతూ వివేకానంద జీవితం చాలా చిన్న వయసులోనే ముగిసిందని కానీ అతను చేసిన ప్రసంగాలు అతను రాసిన పుస్తకాలు ఎప్పటికీ మనకు గుర్తున్నాయని మనల్ని ప్రభావితం చేస్తున్నాయని యువత అంతా ఆయన బాటలో నడవాలని అన్నారు
అనంతరం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన అంశాలను ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులందరూ ఈ కార్యక్రమం సందర్భంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జయరామిరెడ్డి ప్రొఫెసర్స్ బి పూర్ణిమ , సుధారాణి మరియు యువత పాల్గొన్నారు.