గడువులోపు త్రైమాసిక పన్నులు చెల్లించండి…

-సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణం చేసే యాత్రీకుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు ఉంటాయి: జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణా సేవలను ఆంధ్ర రాష్ట్ర పోర్టల్ ఈ ప్రగతి నుండి ”వాహన్’ పోర్టల్ లోకి మార్చిన తర్వాత చెల్లించవలసిన త్రైమాసిక పన్నులు పూర్తిస్థాయిలో నెల చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే చెల్లించాలని స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలియజేశారు. ఈ విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్ప న్నమైనా రవాణా శాఖ కార్యాలయంలో ఆ రోజే సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో వివిధ ప్రదేశాల నుండి తిరుపతికి వచ్చే ప్రైవేట్ బస్సులపై తిరుపతి జిల్లాలోని రేణిగుంట రోడ్డు ఆంజనేయపురం, నాయుడుపేట, మరియు గూడూరులలో వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది. తనిఖీలలో ముఖ్యంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది . ఇప్పటివరకు జిల్లాలో తనిఖీల్లో ప్రయాణికులనుంచి అధిక చార్జీ వసూలు చేస్తున్న 25 బస్సులను గుర్తించామన్నారు. వీటిపై వాహన తనిఖీ రసీదులు నమోదు చేసి 3 లక్షల రూపాయల జరిమానా విధించారు. ముఖ్యంగా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న కాంట్రాక్ట్ క్యారేజ్ ట్రావెల్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచి గుర్తించేందుకు అధికార యంత్రాంగంతో ప్రతిరోజు రెండు బృందాలతో నాలుగు టీములను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తనిఖీలు ఈనెల 19 తారీకు వరకు జరుగుతాయి. ఈ తనిఖీల్లో భాగంగా అధిక చార్జీల వసూలుకు సంబంధిత కేసులే కాకుండా, సరుకు రవాణాపై 8 కేసులు, ప్రయాణికుల జాబితా ప్రదర్శించకపోవడం వంటి కారణాలతో కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో మోటార్ వాహనాల తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, అతి కనాజ్, మోహన్ కుమార్ ఆంజనేయ ప్రసాద్, స్వర్ణలత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *