తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారి పల్లి నందు నేటి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఇంటి వద్దకు వస్తున్న సీఎం చంద్రబాబు వృద్ధ దంపతులను చూసి చలించిపోయి వారికి పెన్షన్ అందించేందుకు భరోసా ఇస్తూ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సిఎం వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడి నుండి వచ్చారు…సమస్య ఏంటని అడిగారు. తన పేరు బి. నాగరాజమ్మ (సుమారు 62సం.) భర్త సుబ్బరామయ్య అని, భీమవరం గ్రామం చంద్రగిరి మండలం అని పక్షవాతంతో సుమారు 5 సం. నుండి బాధపడుతున్నానని, నడవలేక పోతున్నానని, దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలని విన్నవించుకోగా వెంటనే దివ్యాంగ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ను ఆదేశించారు.
Tags tirupathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …