Breaking News

ఈనెల 24 నుంచి భారతీ తీర్ధ మహాస్వామి 75వ జన్మదిన వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్ధ మహాస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా శృంగేరీ పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి ఆదేశంతో 24వ తేది శుక్రవారం ఏప్రియల్ 8 వ తేది వరకు 75 రోజుల పాటు శివరామ కృష్ణ క్షేత్రంలో విశిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ధర్మాధారారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. రామకోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ధర్మాధారారి శిష్ట్లా హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ నిత్య నవ చండీ హోమం, చండీ పారాయం, పూర్ణాహుతి నిర్వహిస్తునట్లు తెలిపారు. సర్వమానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతికోసం కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ రోజూ సాయంత్రం గణేశ పురాణం. భాగవతం, శంకర విజయం. మహాభారతం, భాగవతం,శివభారతం అంశాలుగా లబ్దప్రతిష్టులైన ఆధ్యాత్మికవేత్తల పురాణ ప్రవచన కార్యక్రమంవుటుందని తెలిపారు. సమావేశంలో జొన్నవిత్తు ప్రభాకర శాస్త్రి, గండూరి చంద్రమౌళీ పాల్గొన్నారు. వివరాలకు దేవాలయంలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *