-యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులు హజరు కావాలి కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం లో భాగంగా రాజానగరం మండలం ఎమ్ పి డి వో కార్యాలయం నుంచి హజరు కానున్నట్లు , అదే సమయంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ సోమవారం యధావిధిగా కలక్టరేట్ నుంచే హజరు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించాలన్నారు. డివిజన్ మండల స్థాయి అధికారులు ఆయా ప్రథాన కేంద్రం నుంచి హజరు కావాలని ఆదేశించారు.
ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వ్యయ ప్రయాసలకోర్చి ప్రజలు మండల కేంద్రంలో పరిష్కారం అయ్యే వాటి పరిష్కారం కోసం జిల్లా కలక్టరేట్ కు రావడం జరుగుతోందని, అదే సమయంలో మండల కేంద్రంలో తక్కువ అర్జీలను స్వీకరించడం గమనించడం జరిగిందన్నారు. ఈక్రమంలో తొలిసారిగా నల్లజర్ల మండలం పిజిఆర్ఎస్ కార్యక్రమం లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు ఆయా ప్రథాన కేంద్రం నుంచి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు సోమవారం ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.
రెవెన్యూ, మునిసిపల్, మండల స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదిక లో ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు. మండల స్థాయి అధికారులు అందరూ మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు. ఇకపై ప్రజలు వారి సమస్యలను స్థానికంగా ఉండే అధికారుల సమక్షంలో పరిష్కారం కోసం సంప్రదించాలని కలెక్టరు విజ్ఞప్తి చేశారు.