విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రీజినల్ ఆఫీసర్ ఆర్.కె.సింగ్ యన్.హెచ్.ఎ.ఐ. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగానే విజయ వాడ యన్. హెచ్. ఎ. ఐ రీజినల్ ఆఫీసర్ ఆర్ . కె . సింగ్ సడక్ సురక్ష జీవన్ రక్ష అనే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన్ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రచార సామాగ్రి కరపత్రాలు, గోడ పత్రాలని ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆర్ . కె.సింగ్ మాట్లాడుతూ సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదం తో ప్రచారము చేయాలి అని, వాహన వినియోగ దారులు తప్పని సరిగా రహదారి భద్రతా పై అవగాహన కలిగి ఉండాలి అని , కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి నేతృత్వoలో రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు .రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ సంస్థ తరుపున యన్. టి. ఆర్. జిల్లాలో బేతు రామ మోహన రావు మాట్లాడుతూ అనేక రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నెల రోజులు నిర్వహించి బాగా ప్రచారం చేస్తాము అని ఈ సంవత్సరం సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదం తో ప్రచారము చేస్తాము అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఒక మహిళ ఆర్. కె. దుర్గ పద్మజ గారి నేతృత్వంలో ఈ జిల్లా అధ్యక్షులు గా పనిచేసి సంస్థ కి మంచి పేరు తెస్తున్నామని అని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ రాష్ట్ర అధ్యక్షురా లు ఆర్. కనక దుర్గ పద్మజ, సభ్యులు బంగారయ్య, కోటేశ్వర రావు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై పర్యవేక్షణ కమిటీ సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై జిల్లా అభివృద్ది …