-ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూలాధారం..
-స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి..
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అలవాటు చేసుకుని ప్లాస్టక్ ముప్పు నుండి జిల్లాకు విముక్తి కల్పిద్దామని, ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూలకారణం అని స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమం ద్వారా పచ్చదనం` పరిశుభ్రతలో అగ్రగామిగా నిలుపుదామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
స్వచ్చఆంధ్ర ` స్వచ్ఛ్ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, గొల్లపూడి పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్ని పచ్చదనం పరిశుభ్రత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి నెలా ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్‌గా పాటించాలని నిర్ణయించడం జరిగిందని నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ‘‘క్లీన్ స్టార్ట్’’ పేరుతో కార్యక్రమాన్ని మొదలు పెట్టి ప్రతి రోజు పరిసరాలు పరిశుభ్రతగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్తవేసే అలవాటును అరికట్టడంతో పాటు మాస్ క్లీనింగ్ డ్రైవ్‌ల ద్వారా చెత్త, ముల్లపొదలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మానవ జీవనానికి ప్లాస్టిక్ వలన ఎంతో ముప్పు ఏర్పాడుతుందన్నారు. ఇటీవల బుడమేరు ముప్పుకు ప్లాస్టిక్ వ్యర్థాలు కొంత మేరకు కారణమయ్యాయన్నారు. జూట్ లేదా గుడ్డతో తయారు చేసిన సంచులు వినియోగించాలని, త్రాగునీటికి రాగి లేదా స్టీల్ బాటిళ్ళను వినియోగించాలని హోటళ్ళలో గాజు`స్టీలు పాత్రలనే వినియోగించినట్లయితే ప్లాస్టిక్‌ను కొంత మేరకు నివారించేందుకు అవకాశం ఉందని ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని కోరారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి ప్రధాన కారణమన్నారు. భాధ్యత రహిత్యంగా బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలను వేయడం వలన డ్రైనేజ్ కాలువలు మూసుకుపోవడం కారణంగా దుర్గందంతో పాటు దోమలు ఏర్పడి అంటు రోగాలు ప్రబలుతున్నాయన్నారు. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర `స్వచ్ఛ దివస్‌లో భాగంగా గ్రామ, మండల స్థాయి అధికారులు తొలగించిన చెత్తను డంపింగ్ యార్డ్‌లకు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైన రవాణాకు వాహనాలను దాతల సహకారంతో సమకూర్చుకోవాలన్నారు. మిశ్రమ వ్యర్థాలు కలిగిన చెత్త నుండి ఆ ప్రదేశంలో తడి పొడి చెత్తను వేరు చేసి పెద్దమొత్తంలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పని ప్రారంభించే ముందు మరియు పని సమయంలోను చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు ప్రాంగణాలలో నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో క్రమశిక్షణ పాటించకపోతే భవిషత్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. కాలుష్య రహిత వస్తువులను వినియోగించాలని నిర్థేశించిన ప్రాంతాలలో వ్యర్థాలను పారవేయాలన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను ఇతర పనులకు వినియోగించి పంచాయతీలను నిర్విరోగ్యం చేయడం జరిగిందని ప్రస్తుతం పంచాయతీ నిధులు కేవలం గ్రామ అవసరాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పచ్చదనం పరిశుభ్రతలో అధిక ప్రాధాన్యతనిచ్చేలా అధికారులు చేస్తున్న కృషికి ప్రజా ప్రతినిధుల సహకారం ఎప్పుడు ఉంటుందని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.
అనంతరం నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్చత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్ర ప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ…. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్చతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛఆంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్ధేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను . అంటూ జిల్లా కలెక్టర్ ప్రజలతో ప్రతిజ్ఞా చేయించారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి, డివిజనల్ పంచాయతీ అధికారి జి.ఎన్ఎల్ రాఘవన్ , డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాసరావు, తహాశీల్థార్ బి.సుగుణ కుమారి,యంపిడివో బి. విగ్గిన్స్, పంచాయతీ సెక్రటరీ యం. స్వరూప రాణి, పంచాయతీ ప్రత్యేక అధికారి యం ప్రసాద్, స్థానిక నాయకులు, బొమ్మసామి సుబ్బరావు, జంపాల సీతారామయ్య, పద్మ శేఖర్, అక్కల గాంథీ, ధర్మారావు, గ్రామస్థులు పాల్గొన్నారు.