-గార్భేజ్ వనరబుల్ పాయింట్స్ వద్ద సిసి కెమెరాల నిఘ ఉంచండి..
-అనుమతి లేని ప్రాంతాలలో వ్యర్థాలను వేస్తే కఠిన చర్యలు.
-జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలు రోడ్ల వెంట వ్యర్థా పద్ధార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న గార్భేజ్ వనరబుల్ పాయింట్స్‌ను తక్షణమే తొలగించాలని ఆయా ప్రాంతాలలో సిసి కెమెరాలతో పాటు సిబ్బందిని నిఘా ఉంచి వ్యర్థాలను పడవేసే వారిని గుర్తించి జరిమానాలను విధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛ ఆంధ్ర ` స్వచ్ఛ్ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సమీపంలోని గొల్లపూడి `జక్కపూడి రోడ్డులో అనాధికార గార్బేజ్ వనరబుల్ పాయింట్స్లను పరిశీలించి తక్షణమే వారిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర ` స్వచ్ఛ్ దివస్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి ఆధిక ప్రాధ్యానతనిచ్చి జిల్లాను కాలుష్య రహితంగా తీర్చిదీదేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లు వెంట అనాధికరంగా వ్యర్థా పద్ధార్థాలను విడిచి వేయడం వలన వీపరితమైన దుర్గందంతో పాటు అంటు రోగాలు ఏర్పాడుతున్నాయన్నారు. గ్రామ పంచాయతీ మున్సిపల్ అధికారులు గార్భేజ్ వనరబుల్ పాయింట్స్ (జివిపి)పై ప్రత్యేక దృష్టి పెట్టి వారం రోజులలోపు వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తొలగించిన ప్రదేశాల వద్ద సిసికెమెరాలు పంచాయతీ సిబ్బందితో నిఘా ఉంచి ఎవరైతే అనాధికరంగా వ్యర్థాలను విడిచిపెడుతున్నారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్థేశించిన ప్రాంతాలలో మాత్రమే వ్యర్థాపద్ధార్థాలను విడిచిపెట్టాలని హోటల్ యాజమానులకు వ్యాపారస్తులకు తక్షణమే నోటీసులను అందజేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల వెంట వ్యర్థాపద్దార్థాల గార్భేజ్ వనరబుల్ పాయింట్స్ గుర్తించి వాటిని తొలిగింపుకు గ్రామ పంచాయతీ మున్సిపల్ మండల అభివృద్ధి అధికారులు తహాశీల్థార్లు చర్యలు తీసుకోవాలన్నారు. తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి చెత్తనుండి సంపద తయారి కేంద్రాలకు తరలించాలన్నారు.జిల్లాలో ప్రస్తుతంసంపద తయారి కేంద్రాల నుండి 50 నుండి 80 టన్నుల వర్మి కంపోస్ట తయారీ అవుతుందన్నారు. వర్మి కంపోస్టులు మంచి డిమాండ్ ఉందన్నారు. వర్మి కంపోస్టు కేంద్రాలకు వ్యర్థ పద్దార్థాలను తొలగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్తవేసే అలవాటును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్లీనింగ్ డ్రైవ్‌ల ద్వారా చెత్త, ముల్లపొదల వంటివి తొలగింపు, పరిశాలను శుభ్రపరచడం శిధిలాల తొలగింపు, బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లు, మొదలైన వాటిలో మూసుకుపోయిన కాలువలను డ్రైయిన్లలో పూడిక తీయడం కమ్యూనిటీ మరియు పబ్లిక్ టాయిలెట్లను శానిటైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి, డివిజనల్ పంచాయతీ అధికారి జి.ఎన్ఎల్ రాఘవన్ , డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాసరావు, తహాశీల్థార్ బి.సుగుణ కుమారి,యంపిడివో బి. విగ్గిన్స్, పంచాయతీ సెక్రటరీ యం. స్వరూప రాణి, పంచాయతీ ప్రత్యేక అధికారి యం ప్రసాద్, స్థానిక నాయకులు, బొమ్మసామి సుబ్బరావు, జంపాల సీతారామయ్య, పద్మ శేఖర్, అక్కల గాంథీ, ధర్మారావు పాల్గొన్నారు.