గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆదేశాల మేరకు ” స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివాస్ ” కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ తేజ , డి ఆర్ ఓ షేక్. ఖజావలి తో కలసి కలక్టరేట్ ప్రాంగణంలో చెత్త మరియు వ్యర్ధాలను తొలగించి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులచే వారి వారి కార్యాలయాలను శుభ్రపరచుకుంటామని ” స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివాస్ ” ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాస రావు, జెడ్పి సిఇఓ జ్యోతిబసు, పీడీ డీఆర్డీఏ , విజయలక్ష్మీ , పీడీ డ్వామా శంకర్ , పీడీ హౌసింగ్ ప్రసాద్, మత్స్య శాఖ డిడి గాలిదేముడు , జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, డీటీసీ సీతారామిరెడ్డి , డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్. మహబూబ్ షరీఫ్, డిపిఓ బి.వి.నాగసాయి కుమార్ , జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాస రెడ్డి , జిల్లా ఖజానా మరియు లెక్కల అధికారి వి. స్వామి నాథన్ , సిపిఓ శేషశ్రీ , డిఈఓ రేణుక , డిఎస్ఓ కోమలి పద్మ, ఐసిడీఎస్ పీడీ యం. ఉమాదేవి, జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మీ , రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ డి. శైలజ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై పర్యవేక్షణ కమిటీ సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై జిల్లా అభివృద్ది …