-సంస్థకు ఇది 7వ శాఖ
-ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి మీనాక్షి చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంప్రదాయ డిజైన్లకు ప్రత్యేకమైన డిజైనర్‌గా పేరుగాంచిన ఎమ్మాడి సిల్వర్ జ్యువెలరీ శనివారం విజయవాడ బందర్ రోడ్ లో నూతన షోరూమ్ ను నటి మీనాక్షి చౌదరి తో కలిసి సంస్థ సిఇఒ ఎమ్మడి సునీత, రాకేష్ ఎమ్మడి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఎమ్మాడి సిల్వర్ జ్యువెలరీ ద్వారా ప్రత్యేకమైన బ్రైడల్ జ్యువెలరీ సేకరణను కలిగి ఉంది. కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం, ఆభరణాల ప్రియులు ప్రతి ఒక్కరు ఎమ్మాడి సిల్వర్ జ్యువెలరీ సందర్శించాలని, విజయవాడ ప్రజలను కోరారు. విజయవాడ ప్రజలకు సిల్వర్ డిజైన్లతో అధునాతన సాంప్రదాయ నగలను అందుబాటులోకి తీసుకొచ్చిన షోరూం యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తెలుగు ప్రేక్షకుల విజయం అని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్మడి రమేష్ మాట్లాడుతూ “త్వరలో మరిన్ని స్టోర్‌లు రానున్నందున మేము మరింత విస్తరిస్తాము. మేము ఇటీవల యూఎస్ఏ లో మా స్టోర్‌ను ఆవిష్కరించాము అని తెలిపారు.