Breaking News

ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో ఏపిజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అబ్దుల్ కలామ్  ఆశయాలకు అనుగుణంగా మనమందరం ఆయన బాటలో నడవాలని అన్నారు. జీవితంలో పైకి ఎదగాలంటే పేదరికం అడ్డుకాదాని నిరూపించారని, పేపర్ బాయ్ నుండి భారత రాష్ట్రపతి స్థాయికి చేరటం మనం మర్చిపోలేమన్నారు. ఆయన చేసిన పదవుల వలన ఆ పదవులకు వన్నె వచ్చిందని అన్నారు. ఆయన ఏ రంగంలో పనిచేసినా ఆ రంగానికి ఎనలేని సేవలందించారు అని అన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్  భౌతికంగా మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *