Breaking News

ఆటో కొనుగోలుకు ఆర్థిక సహాయం అందజేత

-ఆటో కొనుగోలుకు రూ.35 వేలు అందచేసిన గద్దె క్రాంతికుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ సేవ, తోటివారికి సహాయం చేసే గుణాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చూసి తామంతా నేర్చుకున్నామని తెలుగుదేశం పార్టీ యువత విభాగం నాయకుడు గద్దె క్రాంతికుమార్‌ పేర్కొన్నారు.
శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వనగర్‌కు చెందిన నడికట్ల కృష్ణమోహన్‌కు ఆటో కొనుగోలు నిమిత్తం డౌన్‌పేమెంట్‌గా రూ.35 వేలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కుమారుడు గద్దె క్రాంతి కుమార్‌ పటమటలోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో అందచేశారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్‌ మాట్లాడుతూ కృష్ణమోహన్‌ దంపతులు గత వారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ను కలిసి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నామని, ఆటో నడుపుతూ ఆటో అద్దె, ఇంటి అద్దె కడుతూ కుటుంబ జీవనోపాధి, పిల్లల స్కూల్‌ ఫీజు చెల్లించుకోవడం కష్టంగా ఉందని వారి ఆవేదనను తెలియజేశారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ వెంటనే స్పందించి లోనుపై కొత్త ఆటో కొనుగోలుకు అవసరమైన డౌన్‌పేమెంట్‌ను గద్దె ఫౌండేషన్‌ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఇచ్చిన హామీ మేరకు గద్దె ఫౌండేషన్‌ ద్వారా రూ.35 వేల చెక్కును వరుణ్‌ మోటార్స్‌ కంపెనీ పేరుతో కృష్ణమోహన్‌ దంపతులకు అందచేశామని గద్దె క్రాంతికుమార్‌ చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందచేయడమే కాకుండా తన వ్యక్తిగత నిధుల నుంచి నియోజకవర్గంలోని పేదలకు సహాయం చేస్తున్నారని చెప్పారు. సమాజ సేవ, తోటివారికి సహాయం చేసే గుణాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ నుంచి తామంతా నేర్చుకుంటున్నామని అన్నారు.
కృష్ణమోహన్‌ దంపతులు మాట్లాడుతూ ఆటో నడుపుతూ జీవనోపాధి కష్టంగా మారిందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ను గత వారం కలిసి విన్నవించామని, లోనుపై ఆటో కొనుగోలుకు డౌన్‌పేమెంట్‌ను తాను అందచేస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హామీ ఇచ్చారని చెప్పారు. చెప్పినట్లుగానే వారం రోజుల లోపే ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కుమారుడు గద్దె క్రాంతికుమార్‌ చేతుల మీదుగా రూ.35 వేలను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చేసిన సహాయాన్ని తమ జీవితాంతం గుర్తించుకుంటామని కృష్ణమోహన్‌ దంపతులు అన్నారు. అడిగిన వెంటనే సహాయం చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, గద్దె క్రాంతికుమార్‌ లకు కృష్ణమోహన్‌ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమములో యనమద్ది శ్రీనివాస్, మెడబలిమి భార్గవ్, మోరంపూడి ధీరజ్, పి.వరుణ్ శ్రీసాయి, తుమ్మల వెంకట్, మాగంటి నితిన్, నిమ్మగడ్డ చిన్నా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *