Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం -2025

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం -2025 ను రూపొందించి ఈ రోజు (01.03.2025) “cse.ap.gov.in” వెబ్‌సైట్‌లో ఉంచడమైనది.
కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సంబంధిత వెబ్సైటును సందర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం -2025 పైన సలహాలు మరియు సూచనలు వెబ్సైట్లో ఉంచిన ప్రొఫార్మాలో 07.03.2025 సాయంత్రం ఐదు గంటల లోపు draft.aptta2025@gmail.com కు పంపించాలని పాఠశాల విద్యా సంచాలకులు కోరడమైనది.
సలహాలు మరియు సూచనలు పంపడానికి విధానం:
1. “cse.ap.gov.in” వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2. అందుబాటులో ఉన్న ప్రొఫార్మాను డౌన్‌లోడ్ చేసుకుని, తగిన వివరాలు నమోదు చేయాలి.
3. పూర్తయిన ప్రొఫార్మాను draft.aptta2025@gmail.com కి పంపించాలి.
విజయ రామరాజు. వి., I.A.S.,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *