Breaking News

గామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి…

-నిర్ణీత సమయంలోనే ప్రజా సమస్యలు పరిష్కరించాలి…
-ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేసే బోర్డులను ప్రదర్శించాలి…
-గ్రామాల్లో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి…
-కోవిడ్ కట్టడికి “నో మాస్క్ నో ఎంట్రీ – “నో మాస్క్ – నో రైడ్”- “నో మాస్క్ – నో సేల్ “…
-నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి…
-ఆర్డీఓ శ్రీనుకుమార్

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏ ఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని ఆర్డీఓ జి. శ్రీనుకుమార్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. శనివారం ఆర్డీవో శ్రీనుకుమార్ అధికారులతో కలసికైకలూరు పట్టణంలోని 2,3,4 సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శులు, వివిధ శాఖలకు సంబందించి ప్రభుత్వ పథకాల అమలు పై పర్సన్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న రిజిష్టర్లు, అటెండెన్సు, మూమెంట్ రిజిష్టర్ల నిర్వహనను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ డివిజన్ పరిదిలో గల గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సర్వీసులకు సంబందించి ఏ ఒక్కటీ పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే సచివాలయ ఉద్యోగులు పరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టరు ప్రతి నెల వారంలో రెండు రోజులు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారన్నారు. డివిజన్ పరిధిలో గల ప్రతి సచివాలయంలో ప్రభుత్వ పథకాలు, వాటి అర్హతలు, సచివాలయం ద్వారా అందించే సేవలు, లబ్దిదారుల వివరాలతో కూడిన బోర్డులు ప్రజలకు తెలిజేసే విధంగా ప్రదర్శించాలన్నారు. ఇందులో ఎటువంటి అలసత్వం వహించినా ఆయా గ్రామ కార్యదర్శులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ భాద్యతాయుతంగావిధులు నిర్వహించాలన్నారు. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు సమయంలో ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వ పథకాల అమలు పై రిజిష్టర్లు నిర్వహణతో పాటు అటిండెన్స్, మూమెంట్ రిజిస్టర్లలను నిర్వహించాలన్నారు. సచివాలయం నందు బియాండ్ యస్.యల్.ఏ పెండింగులో లేకుండా చూడాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు హౌసింగ్ ప్రోగ్రాం నందు జీయో టాగింగ్ ఇవ్వవలసినదిగా ఆదేశించారు . బయోమెట్రిక్ అటెండన్స్ అందరూ తప్పని సరిగా వేయవలసినదిగా ఆదేశించారు. కోరోనా కట్టిడికి వ్యాక్సినేషన్ ప్రదాన మార్గమని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా సచివాలయ పరిదిలో అవగాహన కల్పించాలన్నారు.

కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రదాన మార్గం : ఆర్డీవో
కోవిడ్ మూడవ దశ ప్రభలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున డివిజన్ పరిదిలో వాలెంటీర్లు, ఆశా, వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే పక్కా నిర్వహించాలన్నారు. సర్వేకు వెల్లకుండా వెళ్లినట్లు నివేదకలు ఇస్తే అటువంటి వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టరు వారి ఆదేశాలు మేరకు జిల్లాలో ప్రతి వారం సోమ, మంగళ, బుధవారాల్లో కోవిడ్ కట్టడికి “నో మాస్క్ నో ఎంట్రీ – “నో మాస్క్ – నో రైడ్”- “నో మాస్క్ – నో సేల్”నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్డీవో వెంట తాహశీల్థార్ ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *