Breaking News

బడ్జెట్ వినియోగంపై మంత్రి ఫరూక్ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ఉద్దేశించిన బడ్జెట్ కు సంబంధించిన వినియోగం పై రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్ష చేశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని మైనారిటీ సంక్షేమ పేషి కార్యాలయంలో అధికారులతో మంత్రి చర్చించారు. ప్రస్తుత మార్చి నెల ఆఖరిలోగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి కేటాయించబడిన బడ్జెట్లో ఆయా పనులకు సంబంధించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. మైనారిటీల సంక్షేమానికి ఉద్దేశించిన బడ్జెట్ కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నిధుల వినియోగం అయ్యేలాగా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలోని షాది ఖానాల నిర్వహణ విషయంలో ప్రస్తుత గైడ్ లైన్స్ స్థానంలో కొత్త గైడ్ లైన్స్ రూపొందించి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి, సక్రమ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు. ప్రభుత్వం నుండి అందుతున్న పింఛన్ల సొమ్మును మసీదుల నిర్వహణ కమిటీలకు కాకుండా నేరుగా తమకే అందేలా చూడాలని ఇమాములు,మౌజన్లు తదితరుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుగా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు మసీదుల కమిటీలు, ప్రభుత్వం నుంచి మంజూరై మసీదుల కమిటీల ద్వారా పింఛన్లు అందుకునే వారితో మాట్లాడి నివేదిక అందజేయాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు

-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *