Breaking News

ఈ నెల 15 వ తేదీన తణుకులో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు

-ఈ నెల థీమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం
-మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం ను “స్వచ్ఛ ఆంధ్ర” దినోత్సవంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రతను పెంపొందించేందుకు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA)” ప్రోగ్రాం కోసం కార్యాచరణ మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వచ్ఛ ఆంధ్ర సూచికల ఆధారంగా పారిశుద్ధ్య చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం, పర్యవేక్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ కార్యక్రమాన్ని బహుళ శాఖల సమన్వయంతో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, ఐఏఎస్  మూడో శనివారం జరగబోయే స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన సూచనలను అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, అటవీ, పర్యావరణ, విద్యా, ఆరోగ్య, రవాణా, సంక్షేమ శాఖలు సహా కీలక ప్రభుత్వ విభాగాలు పాల్గొననున్నాయి.

స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం కింద పట్టణాలు, గ్రామాలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్ళు, అంగన్వాడీలు, మార్కెట్లు, రైలు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారులు, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని ప్రధాన పనితీరు సూచికలు (Key Performance Indicators – KPI) ఆధారంగా జిల్లాల ర్యాంకింగ్ చేయనున్నారు. ఈ ర్యాంకింగ్స్‌ను గౌరవ ముఖ్యమంత్రి గారు నెల నెలా సమీక్షించనున్నారు.

ఇందులో భాగంగా జిల్లాల నోడల్ అధికారిగా ప్రధాన ప్రణాళికాధికారి (CPO) వ్యవహరిస్తారు. ఆయా శాఖల ప్రదర్శనను లైవ్ డేటా ఆధారంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్‌దే. ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన కార్యదర్శి గారు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి” అనే థీమ్‌తో నిర్వహించనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు

-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *