Breaking News

అమెరికాలోని నాట్స్ సంబరాలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికాలోని ప్లోరిడా, తంపాలో ఈ ఏడాది జూలై 4 నుండి 6 వరకు జరిగే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఎనిమిదవ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు అమరావతిలోని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయనను ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు కలిశారు. ఈ ఉత్సవాల్లో తప్పనిసరిగా పాలుపంచుకోవాల్సిందిగా నాట్స్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా నాట్స్అధ్యక్షులు మందాడి శ్రీహరి, గుత్తికొండ శ్రీనివాస్, పిన్నమనేని ప్రశాంత్, తదితరులు మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు

-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *