Breaking News

అడ్వాన్స్ నిధులతో శ‌ర‌వేగంగా పోలవరం పనులు

-2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… నిమ్మల పునరుద్ఘాటన.
-కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు- మంత్రి నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు ఉండడంవల్ల అద్భుత ఫలితాలు సాధ్యమవుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి, నిధుల సాధనకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రూ. 5052 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ నిధులు వచ్చినట్లు చెప్పారు. నిధులు సకాలంలో రావడం కేంద్రం పెద్ద మనసుతో సహకరించటం వల్ల పట్టాలు తప్పిన పోలవరం పనులు నేడు పరుగులు పెడుతున్నాయి అన్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు పనులకు టైం షెడ్యూల్ నిర్ణయించుకుని నిర్మాణ సంస్థలైన మేఘా ఇంజ‌నీరింగ్, బావర్, అఫ్రి లతో సమన్వయం చేసుకుంటూ శరవేగంతో చేస్తున్నట్లు చెప్పారు. అలాగే అంతర్జాతీయ నిపుణులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అధికారులు, కేంద్ర జలశక్తి సంఘ ప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలతో పనులు షెడ్యూల్ టైం లో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సందర్శించి సంతృప్తి చెందిన తర్వాతే అడ్వాన్స్ నిధులు ఇవ్వడం ఆనందదాయకమన్నారు. 2014 -19 కాలంలో 72 శాతం పోలవరం పనులు పూర్తి చేసి, అప్ప చెబితే, జగన్ ధ్వంసరచనకు పూనుకొని, ఎక్కడ పనులు అక్కడే వదిలేసి డయాఫ్రం వాల్ ధ్వంశానికి కారకుడు అయ్యాడు అన్నారు.

ఇదే, గత టిడిపి ప్రభుత్వ కాలంలో చేసిన పనులు తాలూకు, రియంబర్స్మెంట్ నిధులు జగన్ హయాంలో వస్తే, ఆ నిధులు కూడా ప్రాజెక్టుకి ఖర్చు పెట్టకుండా దారి మళ్లించాడని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. డయాఫ్రమ్ వాల్ పనులకు ప్రస్తుతం రెండు కట్టర్లను ఉపయోగిస్తున్నాం అని, ఇప్ప‌టి వ‌ర‌కు 136 మీటర్లు పొడవున, 6700 చదరపు మీటర్లు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని స్ప‌ష్టం చేశారు. ఏప్రిల్ మొద‌టి వారం నుండి, మూడో కట్టర్ కూడా అందుబాటుల‌కి వస్తుందని తెలిపారు. ఎగువ కాఫ‌ర్ డ్యాంను బ‌లోపేతం చేయ‌డానికి, బ‌ట్ర‌స్ డ్యాం ఇప్ప‌టికే మొద‌లై శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, వీటితో పాటు క్లే రీచ్ లో డివాల్ నిర్మాణానికి సంబందించి, వైబ్రో కాంపాక్ష‌న్ ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయన్నారు. ఈ ఏడాది డిసెంబరుకి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని, డివాల్ కి సమాంతరంగా ఈసిఆర్ఎఫ్ డ్యాం, తదితర ప్రాజెక్టు పనులు చేస్తూ, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల పునరుద్ఘాటించారు.

అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగమైన నిర్వాసితుల బాధ‌ల‌ను తీర్చ‌డానికి ఏడేళ్ళ త‌రువాత, నేరుగా 990 కోట్ల రూపాయ‌లను, చంద్రబాబు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఈ కారణంగానే నిర్వాసితులు ఈ ఏడాది సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నట్లు ఆయన వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు

-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *