విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సాఫ్ట్ టెన్నిస్ లో ప్రతిభ కనబరిచిన బి ఎన్ యం వి కార్తీక్ కు రూ 25000 వేల విలువైన స్పోర్ట్స్ కిట్ ను అందించారు. కార్తీక్ 2024 లో మధ్యప్రదేశ్ దివాస్ లో జరిగిన (యస్ జి ఎఫ్) సాఫ్ట్ టెన్నిస్ లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్ – 17 కేటగిరీలో తృతీయ స్థానం సాధించాడు. విజ్ఞాన విహార స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కార్తీక్ ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిసి తనను మరింత ప్రోత్సహించాలని కోరడంతో స్పోర్ట్స్ కిట్ అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. సుజనా ఫౌండేషన్ సహకారంతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గురువారం భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో స్పోర్ట్స్ కిట్ ను అందజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
