-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరాముని జీవితం అందరి జీవన గమనానికి తారకమంత్రం అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుడమేరు వంతెన వద్ద ఆదివారం జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, రాజుగా శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. మనిషి ఎలా జీవించాలి, సమాజంలో తన ధర్మాలను ఎలా నిర్వర్తించాలన్నది రామాయణం చెబుతుందన్నారు. తన జీవితం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సర్వ మానవాళికి ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక వెలుగులను అందించారన్నారు. తండ్రి మాటని జవదాటని రామయ్య జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News