Breaking News

విమ్స్‌లో స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల నియామ‌కానికి 29న వాకిన్ రిక్రూట్మెంట్‌

విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ‌ప‌ట్నంలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (విమ్స్‌)లో వివిధ స్పెషాలిటీల్లో 28 మంది డాక్ట‌ర్ల నియామ‌కానికిగాను ఈనెల 29న వాకిన్ రిక్రూట్మెంట్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎపిఎంయ‌స్ఆర్‌బి) మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ ఎమ్వీ శ‌శిక‌ళ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేసే ఈ పోస్టుల‌కు సంబంధించిన విద్యార్హ‌త‌లు, నిబంధ‌న‌ల వంటి పూర్తి వివ‌రాల కోసం http://apmsrb.ap.gov.in/msrb/. మ‌రియు http://dme.ap.nic.in వెబ్సైట్ల‌ను చూడాల‌ని సూచించారు. ఎం.సిహెచ్-న్యూరో స‌ర్జ‌రీలో 3, ఎం.డి/డిఎన్‌బి-అన‌స్థీషియాలో 10, హాస్పిట్ అడ్మినిస్ట్రేష‌న్ (మెడిక‌ల్‌)లో 3, డిఎం-కార్డియాల‌జీ, డిఎం/ డిఎన్‌బి(జ‌న‌ర‌ల్ మెడిసిన్‌), డిఎం/డిఎన్‌బి-ఎమెర్జెన్సీ మెడిసిన్ మ‌రియు డిఎం క్రిటిక‌ల్ కేర్ మెడిసిన్ విభాగాల్లో రెండేసి, డిఎం-గ్యాస్ట్రోఎంటాల‌జీ, ఎం.సిహెచ్‌-స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రోఎంటాల‌జీ, డిఎం-ఎండోక్రైనాల‌జీ, డిఎం/డిఎన్‌బి ఆర్థోపెడిక్స్‌, ఎండి/డిఎన్‌బి ప‌ల్మ‌నాల‌జీలో ఒక్క‌క్క‌టి చొప్పున స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల పోస్టుల్ని భ‌ర్తీ చేస్తామ‌ని ఆమె తెలిపారు. విశాఖ‌ప‌ట్నంలోని హ‌నుమంత‌వాక‌లో ఉన్న విమ్స్‌లో ఈనెల 29న ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వ‌ర‌కు వాకిన్ ఇంట‌ర్‌వ్యూకు హాజ‌రు కావాల‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *