Breaking News

మైల‌వరం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం ప్ర‌ణాళిక సిద్దం…త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబుకి అంద‌జేత : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో స్వ‌ర్ణాంధ్ర విజన్ -2047 మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ డాక్యుమెంటేష‌న్ పై స‌మీక్షా స‌మావేశం
-ఈ స‌మావేశంలో ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
-అగ్రిక‌ల్చ‌ర్, హార్టిక‌ల్చ‌ర్, టూరిజం, స్పోర్ట్స్, ఇండ‌స్ట్రీ ప‌రంగా అభివృద్దికి అవ‌కాశం
-విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి రాజ‌ధాని అభివృద్ధిపై ఆధార‌ప‌డిన మైల‌వ‌రం అభివృద్ధి

ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వ‌ర్ణాంధ్ర విజన్ -2047 కి సంబంధించి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశానుసారం మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దికి ప్ర‌ణాళిక సిద్ధమైంది. త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబుకి మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దిపై డాక్యుమెంటేష‌న్ అంద‌జేస్తామ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ -2047 లో భాగంగా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దికి సంబంధించి త‌యారైన డాక్యుమెంటేష‌న్ పై ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం గొల్ల‌పూడి లోని శ్రీ సాయిద‌త్తా క‌ళ్యాణ మండ‌పంలో బుధ‌వారం మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ ఆధ్వ‌ర్యంలో ప‌లు విభాగాల ప్ర‌భుత్వాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మీక్షా స‌మావేశానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు..

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో హార్టిక‌ల్చ‌ర్ ఎక్క‌డైనా వుందంటే అది మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోనే అంటూ…రాబోయే నాలుగేళ్ల‌లో రాజ‌ధాని ప్రాంతంలో మ‌రెన్నో అభివృద్ది ప‌నులు జ‌రుగుతాయ‌ని అందుకు త‌గ్గ‌ట్లుగా హ‌ర్టిక‌ల్చ‌ర్ లో స‌ప్లై వుండే విధంగా చూడాల‌ని హార్టిక‌ల్చ‌ర్ అధికారుల‌కు సూచించారు. భ‌వానీపురం పవిత్ర సంగమం దగ్గ‌ర గ‌త టిడిపి ప్ర‌భుత్వ హ‌యంలో జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం జ‌రిగేది. ఆ స‌మ‌యంలో చిరు వ్యాపారులు అక్క‌డ వ్యాపారం చేసుకునే ప‌రిస్థితి వుండేద‌న్నారు. టూరిజం శాఖ వారు జ‌ల‌హార‌తి కార్య‌క్రమానికి మొద‌లుపెట్టే విధంగా చూడాల‌ని.. ఆ కార్య‌క్ర‌మం మొద‌లు అయితే అటు చిరు వ్యాపారుల‌కు, ఇటు టూరిస్టుల సంఖ్య పెర‌గ‌టానికి అవ‌కాశం వుంటుంద‌న్నారు.ఇటీవ‌ల కృష్ణ న‌దీ తీర ప్రాంతమైన చిన్నలంక చూడ‌టం జ‌రిగిందని, ఆ ప్రాంతం చాలా అందంగా వుంది..వ‌ర‌ద‌ల‌ను త‌ట్టుకునే విధంగా టూరిజం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి బోటింగ్ ఏర్పాటు చేయాల‌న్నారు. వీటితో పాటు కొండ‌ప‌ల్లి ప్రాంతాన్ని కూడా మ‌రింతగా అభివృద్దిగా అభివృద్ది చేస్తే అమ‌రావ‌తికి తీసిపోని విధంగా మైల‌వ‌రం వుంటుంద‌న్నారు. త్వ‌ర‌లో కొండ‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ కూడా శాటిలైట్ స్టేష‌న్ కింద అభివృద్ది జ‌రిగే విధంగా కృషి చేస్తాన‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానికి అతి సమీపంలో వున్న మైల‌వ‌రం నియోజ‌వ‌ర్గం విజ‌య‌వాడ‌తో పాటు అమ‌రావ‌తి రాజ‌ధానికి ముఖ ద్వారమ‌ని, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అగ్రిక‌ల్చ‌ర్, హార్టిక‌ల్చ‌ర్, టూరిజం, స్పోర్ట్స్ వంటి ప‌లు విభాగాల అభివృద్దికి అవ‌కాశం వుందన్నారు.

ఈ స‌మావేశంలో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన పార్టీ ఇన్చార్జ్ అక్క‌ల రామ్మోహ‌న‌రావు (గాంధీ), మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ బిజెపి ఇన్చార్జ్ నూతల‌పాటి బాల‌కోటేశ్వ‌ర‌రావు (బాల‌), సివిల్ స‌ప్లై డి.ఎమ్. ,విజ‌న్ 2047 నోడ‌ల్ ఆఫీస‌ర్ స‌తీష్‌, మైల‌వ‌రం ఎమ్.డి.వో. విజ‌న్ 2047 కో-ఆర్డినేట‌ర్ అనురాధ‌ ల‌తోపాటు ప‌లు విభాగాల ప్ర‌భుత్వాధికారులు ఎన్టీయే కూట‌మి నాయ‌కులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *