Breaking News

ఆరు ఏకరాలు భూమిని ఇండ్ల స్థలాలు కొరకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలన

ఏలూరు/ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముసునూరు మండలం వేలుపుచర్ల లోని ఆరు ఏకరాలు కొండ పోరంబోకు భూమిని ఇండ్ల స్థలాలు కొరకు అధికారులు, కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఆరు ఏకరాలు భూమిని సర్వే చేసి,చదును చేసి ఇండ్ల స్థలాలకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంతమందికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వవచ్చునని తహశీల్దారును మంత్రి అడగగా 60 మందికి ఇవ్వవచ్చునని తెలిపారు. సర్వే పనులు, లెవిలింగు పనులు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు అందజేయటకు సిద్ధం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కె.వెంకటరమణ,యంపిడివో బి.ఏ.సత్యనారాయణ, కూటమి నాయకులు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *