సంక్షేమ పధకాలను అందరికీ అందేటట్లు చూస్తాను… : షేక్ ఖలీఫాతుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు నగరము లోని మంగమూరు డొంక ఏరియాలో తాత్కాలిక నివాసము ఉంటున్న సంచార జాతులకు చెందిన గంగిరెడ్డి యాదవ్ ల కుటుంబాలను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న భారతీయ జనతా మాజ్దూర్ సెల్ (BJMC ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా. ఈ సందర్బంగా సంచార జాతికి చెందిన గంగిరెడ్డి యాదవ్ కుటుంబలకు చెందిన పలువురు మాట్లాడుతూ తమసమస్యలు ఎవరుకూడా పట్టించుకోవడం లేదని వారి బాధలను చెప్పుకున్నారు. వెంటనే స్వందిస్తూ రోజువారీ కూలీ పనికి వెళ్ళేవారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాలను అందరికీ అందే టట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని NDA కూటమి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ -శ్రమ్ కార్డులను మీలో కార్మికులైన వరందరికి వచ్చే విధంగా కార్మిక శాఖ అధికారులతో మాట్లాడి మివద్దె క్యాంప్ పెట్టి ఈ -శ్రమ్ కార్డులు., మరియి ఆధార్ కార్డులు వచ్చే విధంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఒంగోలు నగర BJMC అధ్యక్షులు T S శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *