Breaking News

ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…

-ప్రభుత్వఉద్యోగి ఎవరైనా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే రద్దు చేయడం జరగుతుంది…
-ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య పోరాట ఉద్యమం స్పూర్తి రాజకీయ విలువలను భావితరాలకు స్పూర్తి దాయకం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలపై స్ఫందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు.
స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలను అధికారులను అదేశించారు. డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యలపై స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారునికి పరిష్కార పత్రాన్ని అందజేయాలని అధికారులకు సూచించారు. తమ పరిధిలో లేని ధరఖాస్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీ అధికారులు తమ కార్యాలయానికి వచ్చిన అర్జీలను సక్రమంగా తేదీల వారీ వరస క్రమంలో రిజిష్టరు లో నమోదు చేసి అర్జీదారునికి ఆన్ లైన్ రశీదును అందజేయాలన్నారు.


మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆర్డీవో శ్రీనుకుమార్…
ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ఒంగోలు జిల్లాలో పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి ఉన్నత విద్యను అభ్యశించి తదుపరి మద్రాసులో అడ్వకేట్ పనిచేశారు. స్వాతంత్ర్య పోరాట ఉద్యమం, వారి రాజకీయ విలువల స్పూర్తిని మన తరంతో పాటు భావితరాలకు తెలియచేప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విజయవాడలో కాటన్ నిర్మించిచన బ్యారేజ్ ను 1955లోనే ఆయన అయాంలో పూర్తి చేసినందున ప్రకాశం బ్యారేజ్ గా ఆయన పేరును నామకరణం చేశారన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులై ఉండి తెల్లరేషన్ కార్డు కలిగివున్న వారికి కార్డులు తొలగించడం జరుగుతుంది : ఆర్డీవో శ్రీనుకుమార్
గుడివాడ డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో 1312 మంది ప్రభుత్వ ఉద్యోగులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారని తనిఖీల్లో వెల్లడయినందున వారు కార్డులను రద్దు చేయడం జరగుతుందని ఆర్డీవో శ్రీనుకు్మార్ అన్నారు.
రూ. 10 వేల రూపాయలు ఆదాయం పైబడి ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తెల్ల రేషన్ కార్డుకు అర్హులు కారన్నారు. ప్రభత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ గా పనిచేయుచున్న వారికి కూడా నెల సరి రూ. 15000 వేల రూపాయలు పైబడి ఆదాయం వస్తున్నందన్నారు. డివిజన్ పరిధిలో సుమారు 1312 మంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారనే సమాచారం ఉన్నందున వీరి కార్డులు రద్దుచేస్తూ, రేషన్ జాబితా నుంచి పేర్లను తొలగించే విధంగా సంబందిత తాహశీల్థార్లు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించామని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు.
అర్జీలు :- గుడివాడ 9 వ వార్డు శ్రీ మద్విరాట్ పోతులూరి బ్రహ్మేధ్ర స్వామి దేవస్థానంలో పూసపాటి రాంబాబు పూజారిగా పూజాది కార్యక్రమాలు చేస్తున్నారని అయితే కరోనా కారణంగా భక్తులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వారికి దేవాదాయ శాఖ నుంచి నెల సరి వేతనాన్ని మంజూరు చేయాలని దేవస్థానం ప్రదాన కార్యదర్శి రాచమళ్ల సురేష్ బాబు తమ అర్జీలో కోరారు.
కార్యక్రమంలో కార్యాలయపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిప్యూటీ డీఇ కమల కుమారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *