
-అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించండి..
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
-సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను నిర్ణీత సమయంలోనే లబ్దిదారులకు చేరువ చెయ్యాలి…
-సచివాలయాలు, ఆర్బీకేలు, వైస్సార్ హెల్త్ క్లినిక్ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి…
-కలెక్టరు జె. నివాస్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ నియోజకవర్గం రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జే నివాస్ తో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మంత్రి కొడాలి నానికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రముఖులు మంత్రి కొడాలి నానికి పూలమాలలు వేసి సత్కరించారు. సచివాలయ భవనంలోని విభాగాలన్నీ పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లతో మాట్లాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత సచివాలయం ద్వారా మల్లాయిపాలెం గ్రామంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, లబ్దిదారుల జాబితాల వివరాలను మంత్రి కొడాలి నానికి తెలియజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయల సమర్ధతను పెంచేందుకు సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఐటీడీఏ పీవోలు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారన్నారు. వారానికి కనీసం నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ తనిఖీల వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుస్తాయన్నారు. పేదలు, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. ఏవైనా తప్పులు జరిగితే వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. తప్పులు జరగకుండా చూసుకోవాలని, అప్పుడే అర్హులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో అందుతాయన్నారు. ప్రభుత్వ పథకాల కోసం వచ్చిన దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాలని, అర్హులని తేలితే ఖచ్చితంగా పథకాలను లబ్ధిదారులకు అందించాలన్నారు. సచివాలయాల్లో రిజిష్టర్లు, రికార్డుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. దీనివల్ల ప్రతి 2 వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం వస్తుందన్నారు. ప్రజలకు అత్యంత చేరువలోనే సేవలు లభిస్తాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే ఆక్రమణలు, అన్యాక్రాంతం జరగడానికి ఆస్కారం ఉండదని మంత్రి కొడాలి నాని చెప్పారు.
కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ముంగిటకే పాలన చేరువ కావాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయాలు, ఆర్భీకే కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సర్వీసులు గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్టప్రభుత్వం పనిచేస్తుందని నాణయమైన విత్తణాలు, ఎరువులు, పురుగు మందులు వారి గ్రామంలోనే ఉన్న రైతు భరోసా కేంధ్రాలు ద్వారా అందించడంమే కాకుండా ధాన్యానికి మద్దతు ధరను కల్పించడం, వ్యవసాయ అనుబంధ శాఖల రైతులకు నాణ్యమైన పనుముట్లను సబ్సిడీ పై అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని ఆదిశగా ప్రతి గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తూ వారి గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలందింస్తున్నారు. సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపైన్ లో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీ, ఇద్దరు వాలెంటీర్లు నెలలో చివరి శుక్రవారం, శనివారం తమ పరిదిలో గల ఇళ్ళకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందుతున్నదీ లేనిది తెలసుకోవడంతో పాటు వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కలెక్టరు జె. నివాస్ అన్నారు. ఈ సందర్బంగా కలెక్టరు మల్లాయపాలెం గ్రామంలో రూ. 79.30 లక్షలు విలువ గల గ్రామ సచివాలయం, ఆర్బీకే, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను ప్రారంబించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్ర వద్ద జగనన్న పచ్చతోరణం లో భాగంగా జిల్లా కలెక్టరు జె. నివాస్ మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు కె. మాధవీలత, అసిస్టెంట్ కలెక్టర్ శోభిక, డ్వామా పీడీ గోర్జీ సూర్యనారాయణ, పంచాయితీరాజ్ ఎస్ ఈ యం వీరాస్వామి, ఈఈ పీవి రమణరావు, డీఈ ఏ .హరిబాబు, ఏఇ . వి. సూరిబాబు, తాహశీల్థారు శ్రీనివాసరావు, యంపీడీవో ఏ.వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ, వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నేతలు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మురారి నగేష్, పొడిచేటి కృష్ణ, గోవాడ చంటి, తాజుద్దీన్, గోళ్ళ రామకృష్ణ, కలపాల కిరణ్, యార్లగడ్డ మురళి, నైనవరపు శేషుబాబు, బంటుమిల్లి సూర్యనారాయణ, మేకల సత్యనారాయణ, సత్యదుర్గా ప్రసాద్, పెనుమూడి రమేష్, దొండపాడు మురళి, బచ్చు మణికంఠ, గంటా శ్రీను, కొండపల్లి కుమార్ రెడ్డి, మొండ్రు వెంకటేశ్వరరావు, నగుళ్ళ సత్యనారాయణ, మాదాసు వెంకటలక్ష్మి, చుండూరి శేఖర్, అలీబేగ్, రంగా, యార్లగడ్డ సత్యభూషణ్, గుత్తా నాని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News