-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)
-వార్డు సెక్రటరీలు, వాలెంటీర్లు తమ పరిదిలోని ఇంటింటీకీ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నదీ లేనిదీ తెలుసుకొని డేటా ఎంట్రీ చెయ్యాలి…
-కలెక్టర్ జె. నివాస్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానలక్ష్య లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు
శుక్రవారం స్థానిక తొమ్మిదవ వార్డు రంగనాయకమ్మ వీధిలో మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ నివాస్, జాయింట్ కలెక్టర్లు, కె.మాధవి లత,ఎల్. శివ శంకర్ లతో కలిసి సిటిజన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని కలెక్టర్ జె. నివాస్ ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందుతున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సిటిజన్ ఔట్రీచ్ కాంపైన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశారు జారీచేసారన్నారు. అందులో భాగంగా నేడు గుడివాడ పట్టణంలో రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి నాని ఆద్వర్యంలో నేడు ప్రారంబించామన్నారు. నెలలో చివరి శుక్ర,శనివారాలోల్ ఆయా వార్డు సచివాలయం పరిధిలో సెక్రెటరీ ఇద్దురు వాలంటీర్లు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందుతున్నదీ లేనిది తెలుసుకొని సంబందిత డేటాను నిర్ణీత ప్రొఫార్మా నింపాల్సి ఉంటుందన్నారు. అదే సమయంలో వారి సమస్యలను కూడా విని వాటిని పరిష్కరించాలన్న్దే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఈ సందర్భంగా స్థానికు లైన తేనెల సత్యవతి కలెక్టరు జె. నివాస్ వివరిస్తూ ఎంతో కాలంగా చింతలకాల్వ ప్రక్కన కుటుంబంతో నివాసం ఉంటున్నామని డ్రైన్ మురుగు నీటి పారుదల లేక దోమల బెడద ఎక్కువగా ఉందని కలెక్టరు దృష్టికి తెచ్చారు. సిద్ధ సోమమ్మ అనే మరో మహిళ తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. తోట అలివేణి కలెక్టరుకు వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి వచ్చిందని, ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఇకరాదు అనుకునే అగ్రిగోల్డ్ సొమ్ము మంజూరు అయిందని ఆనందం వ్యక్తం చేసారు. ఇళ్ళ స్థలం మంజూరు చేశారని ఇల్లు నిర్మించుకుంటున్నాని తెలియజేశారు. టైలరింగ్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు రుణ సౌకర్యం కల్పించాలని కలెక్టరు అలివేణి కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు, కె. మాధవిలత, ఎల్. శివ శంకర్, ట్రైనీ కలెక్టర్ శోభిత, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తాసిల్దార్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News