-ఇప్పటికి లక్షమందిని అనర్హులుగా తేలారు,మరో 50వేల మంది సర్టిఫికెట్ల పున:పరిశీలనకు రాలేదు
-రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ప్రతిపక్ష పార్టీ విషం చిమ్ముతున్నది
-4 రోజుల్లో 47 లక్షల మంది ఉచిత బస్సు ప్ర్రయాణాన్ని వినియోగించుకున్నారు
-రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బోగస్ సదరం సర్టిఫికెట్లతో దివ్యాంగుల పింఛన్లను పొందే అనర్హులను ఏరివేసేందుకే సదరం సర్టిఫికెట్ల పున:పరిశీలన కార్యక్రమం జరుగుచున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. గతంలో ఉన్న అర్హతలను బట్టే సర్టిఫికెట్ల పున:పరిశీలన జరుగుచున్నదని, అర్హతలను మార్చి పింఛనుదారులకు అన్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ప్రవర్తించడం లేదని ఆయన తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం క్రింద దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే రూ.6,000/- ల పింఛనును గత ప్రభుత్వం హయాంలో అనర్హులకు కూడా మంజూరు చేసి దుర్వినియోగం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగ పింఛన్లను పొందడం జరుగుచున్నదని, వారిలో 5.10 లక్షల మందికి చెందిన సదరం సర్టిఫికెట్లను పున:పరిశీలించేందుకు నోటీసులు జారీచేయడం జరిగిందన్నారు. అయితే ఇప్పటి వరకూ 4.50 లక్షల మంది వారి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోగా, వారిలో దాదాపు ఒక లక్ష మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించడమైందన్నారు. అదే విధంగా మిగిలిన వారు తమ సర్టిఫికెట్లను రీవెరిపై చేయించుకొనేందుకు ముందుకు రాలేదన్నారు. వీరందరికీ మరో సారి నోటీసులు జారీ చేస్తామని, అప్పటికీ వారు ముందుకు రాకపోతే వారి పింఛన్లను నిలుపుదల చేస్తామని తెలిపారు. అయితే వైద్యులు ఎవరిని అయితే అనర్హులుగా దృవీకరించారో వారు మరో సారి తమ అర్జీని మండల అభివృద్ది అధికారికిగాని, మున్సిఫల్ కమిషనర్ కు గాని అందజేసినట్లతై మరో సారి వారి అర్హతను పరిశీలించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాలో సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేన్ జరిగిందని, అయితే అత్యధికంగా పులివెందులలోనే 1,708 మంది బోగస్ పింఛను దారులు ఉన్నట్లు గుర్తించడమైందన్నారు. అదే విధంగా మచిలీపట్నంలో 1,539 మంది, చంద్రగిరిలో 1,604 మంది బోగస్ పింఛనుదారులను గుర్తించడమైందన్నారు. అదే విదంగా అత్యల్పంగా కాకినాడలో 19 మంది, విశాఖ దక్షిణ నియోజక వర్గంలో 39 మంది మరియు తాడికొండలో 55 మంది బోగస్ పింఛనుదారులను గుర్తించడం జరిగిందన్నారు.
అర్హులకు మాత్రమే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుంటే, ఇటు వంటి ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీలు ఏ విధంగా తప్పుపడతాయని ఆయన ప్రశ్నించారు. పింఛన్లను ఎదో విధంగా తొలగించాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం లేదని, దేశంలోనే అత్యధికంగా పింఛన్లు, పింఛను సొమ్ము ఇచ్చేది తమ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం రూ.3 వేల పింఛను ఇస్తానని హామీ ఇచ్చి ఘోరంగా మోసం చేయడం జరిగిందని, అయితే తమ ప్రభుత్వం రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచడమే కాకుండా, అధికారంలోకి వచ్చే మూడు మాసాల ముందు నుండే పెంచిన పింఛను ఎరియర్స్ ను కూడా పింఛను దారులకు చెల్లించడం జరిగిందన్నారు. దేశంలోనే అత్యదికంగా పింఛన్లను ఇస్తున్నది తమ కూటమి ప్రభుత్వం అని, దివ్యాంగులకు రూ.6 వేలు, మంచంమీద నుండి లేవలేని అంగవికలురకు రూ.15 వేలు, దీర్ఝకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛను తమ ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా తమ ప్రభుత్వం దాదాపు 65 లక్షల మంది పింఛన్లు అందజేస్తుంటే, గత ప్రభుత్వం సిక్స్ స్టెప్ వేలిడేషన్ అని, ప్యామిలీ మ్యాపింగ్ అంటూ కొన్ని లక్షల మంది పింఛన్లను రద్దు చేయడం జరిగిందన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే, వారి స్థానంలో భార్యకు వితంతు పింఛనును కూడా తమ ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు.
రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా విషం చిమ్ముతున్నది…….
రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ప్రధాన ప్రతిపక్షపార్టీ విషం చిమ్మడం ఎంతో దురదృష్టకరమన్నారు. విభజనతో ఎంతగానో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు రాజకీయ విబేదాలను ప్రక్కనపెట్టి అన్ని రాజకీయ పార్టీలు కృషిచేయాల్సినదిపోయి, అభివృద్దిని అడ్డుకునే విధంగా, రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా విషం చిమ్మడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని ఆయన అభివర్ణించారు.
రాష్ట్ర రాజధాని అమరావతి పై గత ప్రభుత్వానికి ఉన్న ద్వేషంతో ఎటు వంటి అభివృద్ది పనులు నిర్వహించకపోవడం వల్లే నేడు రాజధాని ప్రాంతం ముంపుకు గురవ్వడానికి కారణమన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 30 నుండి 50 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రాజధాని ప్రాంతంలో బారీ వర్షాలకు కొంత ఇబ్బంది రావటం సహజమేనని, దాన్ని భూతద్దంలో చూపుతూ రాజదాని ప్రాంతం ముంపుకు గురైందని చిలవలు పలవలుగా రాద్దాతం చేసే విదంగా దుష్ప్రాచారం చేయడం అంటే రాష్ట్రాభివృద్దిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడ్డుకోవడమే అని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో జరిగే నిర్మాణాలు, కట్టడాలు ఏ మాత్రం వరద నీటికి గురవ్వకుండా ఉండేందుకు అవసరమైన వరద నీటి పారుదల వ్యవస్థలను ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముంబాయి, హైద్రాబాదు వంటి మహా నగరాలు కూడా వరద నీటితో ముంపుకు గురవుతున్నాయని, అటు వంటిని నిర్మాణ దశలో ఉన్న అమరావతి రాజధాని ప్రాంతంలో అదిక వర్గాల వల్ల కురిసిన వరద నీరు నిల్వ ఉండటం సహమేనన్నారు.
4 రోజుల్లో 47 లక్షల మంది ఉచిత బస్సు ప్ర్రయాణాన్ని వినియోగించుకున్నారు …….
మహిళల అభ్యున్నతిని, సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడం జరుగుచున్నదన్నారు. గత నాలుగుం రోజుల్లో దాదాపు 47 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్ర్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని, తద్వారా రూ.19 కోట్ల మేర ఆధాయాన్ని వారు పొందారని మంత్రి తెలిపారు. అయితే ఇటు వంటి మంచి పథకం పై కూడా విషం చిమ్మే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రవర్తిస్తున్నదనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాల్లో భద్రత దృష్ట్యా ఉచి బస్సు ప్రయాణాన్ని తొలుత అనుమతించడలేదని, అయితే తదుపరి ఆ విషయాన్ని పున:పరిశీలించి ఇప్పుడు కొండ ప్రాంతాల్లో కూడా మహళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, వాటికి తోడు వృత్తి నైపుణ్యం యువత కూడా పెద్ద ఎత్తున ఉందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ది కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తున్నదని, ప్రతి పక్ష పార్టీలు కూడా ఈ యజ్ఞానికి సహరిస్తూ రాష్ట్రాభివృద్దికి చేయూతను అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News