ఒంగోలు పట్టణ క్షౌరశాల భవనం కోసం తన సహకారం అందజేస్తా… : షేక్ ఖలీఫాతుల్లా బాషా

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు నగరంలోని గాంధీ నగర్ లేఔట్ లో ఉన్న ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం కు 183/2023 రిజిస్టర్ నెంబర్ సంబంధించిన స్థలన్ని గురువారం ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం అధ్యక్షులు కొణిజేటి రామకృష్ణ అధ్యర్యంలో భారతీయ జనతా మాజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా పర్యవేక్షించారు. సంఘము అభివృద్ది లో భాగంగా ఈ స్థలంలో సంఘం తరుపున భవన నిర్మాణం కోసం షేక్ ఖలీఫా తుల్లా బాషా సహాయం అడిగినందున ఈ రోజు స్థలం చూడడం జరిగింది. ఈ సందర్బంగా షేక్ ఖలీఫా తుల్లా బాషా మాట్లాడుతూ ఒంగోలు పట్టణ క్షౌరశాల భవనం కోసం తన సహకారం అందిస్తానని తనతో పాటు మరి కొందరు మిత్రులతో భవన నిర్మాణం కోసం సహాయం అందేవిధంగా కృషి చేస్తానన్నారు. ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్ననాటినుంచి సోదరుడు కొణిజేటి రామకృష్ణ సంఘం అభిరుద్ది కి చాలా కష్ట పడడం నేను చూస్తున్నననీ కొణి జేటి రామకృష్ణ లాంటి నాయకుడు ఉంటే సంఘం అభిరుద్ది తో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుందని రామకృష్ణ ని అభినందించారు. ఈ కార్యక్రమం లో కోశాధికారి బూసరపల్లి శ్రీనివాసులు గౌరవ సలహాదారులు కలవకూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *