ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు పోస్టింగ్స్ ఇచ్చే ముందు రిక్వెస్ట్ బదిలీలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలి…

-ఆర్టీసిలో దశాభ్దాలు ఉన్న ఆనవాయితీ మేరకు ఏడి/పిడి డిప్యూటీ సూపరిండేంటు పదోన్నతులు ప్రమోషన్ కోటాలోనే భర్తీ చేయాలి
-ఆర్టీసీ యం.డి కి విజ్ఞప్తి చేస్తూ లేఖ ఇచ్చిన ఇ.యు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపియస్ ఆర్టీసీ 2020 న ప్రభుత్వంలో విలీనం అయినప్పటికీ గత ఆరేళ్లుగా ఆగిపోయిన ఉద్యోగుల పదోన్నతులు పై యం.డి.ద్వారక తిరుమలరావు  చేసిన కృషి మేరకు ముఖ్యమంత్రి  అనుమతులు ఇవ్వడంతో అన్నికేటగిరిల ఉద్యోగులలో సుమారు మూడువేల మందికి పదోన్నతులు రానున్నాయి. అయితే ఎన్నో ఏళ్లుగా రిక్వెస్ట్ బదిలీలకు ధరఖాస్తు చేసుకున్నవారికి ఈ పదోన్నతులు కల్పించే సమయంలో రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ గురువారం ఏపిపిటిడి కమిషనర్ & యం.డి కి లేఖ ఇచ్చామని ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షలు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య గురువారం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసారు. అలాగే ఈ పదోన్నతులలో దశాబ్దాలుగా వున్న ఆనవాయితీ ప్రకారం పర్సనల్ & అకౌంట్స్ విభాగాలలో సీనియర్ అసిస్టెంటు నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ పదోన్నతులలో మాత్రం వున్న ఖాళీలన్నిటినీ అనుభవం కలిగిన ప్రమోషన్ కోటా సిబ్బంది ఉంటారన్న భావనతో పదోన్నతులు ఇచ్చేవారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి అనుమతి మేరకు ఆర్టీసీలో ఉన్న పద్దతుల్లోనే పదోన్నతులకు అనుమతులు ఇచ్చినందున పాత పద్దతుల్లోనే ఏడి/పిడి విభాగాల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ పదోన్నతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ ఇచ్చామని ఇ.యు నాయకులు పలిశెట్టి దామోదరరావు, జి.వి.నరసయ్య తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *