Breaking News

శీ అభయాంజనేయస్వామివారి దేవస్థానంలో ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానం నందు మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్‌రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం నెలకొల్పబడి సంవత్సరం నిండిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్‌ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన తరువాత మొట్టమొదటి వార్షికోత్సవ వేడుకల దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేసి భక్తులకు అన్ని విధాలు సౌకర్యవంతమైన విధంగా తీర్చిదిద్దే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ఈ రోజు భక్తులకు ప్రసాద వితరణ కావించామన్నారు. దేవాలయంలోని శ్రీ అభయాంజనేయ స్వామికి అర్చకుడు వినయ్‌కుమార్‌శర్మ పూజాకార్యక్రమాలు, అభిషేకం, అలంకారం నిర్వహించగా పలువురు హనుమాన్‌ చాలీసా పారాయణం, వివిధ రకాలైన పూలతో, తమలపాకులు, తదితర పండ్లతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాగంలో గూడూరు వెంకట్రావు, జూటూరి మోహన్‌ తదితరులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిశెట్టి శ్రీను, ముద్రబోయిన జగన్‌, పుసుపులేటి గణేష్‌, వెంకట్రావు, కటారి సురేష్‌, కె.వెంకటేశ్వరరావు, పి.లక్ష్మణరావు, ముద్రబోయిన గోపీ, కఠారి సురేష్‌, కూరపాటి ప్రవీణ్‌, కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *