Breaking News

పేదల ఆరోగ్యభద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

-ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్యసేవలందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-నూజివీడు నియోజకవర్గంలోని పేదలకు 6 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద అందించాం
-మరో 15 నుండి 20 కోట్ల రూపాయలు అందిస్తాం
-ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజులు, సీట్ల కోటాలో నిబంధలు ప్రకారమే జరుగుతుంది
-నూజివీడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణ జిల్లాలో విలీనంపై మంత్రుల సబ్ కమిటీ అధ్యయనం చేస్తోంది
-ఏ పేదవాడు తనకి అన్యాయం జరిగిందని బాధపడే పరిస్థితి రాకుండా వారిలో ధైర్యం నింపడమే తన లక్ష్యం
-నూజివీడులో ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక శ్రీనివాస సెంటర్ లో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 122 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కోటి రూపాయలు విలువైన చెక్కులను, 104 మంది కల్లుగీత కార్మికులకు కొత్త కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్య సేవలందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఏ పేదవాడు తనకి అన్యాయం జరిగిందని బాధపడే పరిస్థితి రాకుండా వారిలో ధైర్యం నింపడమే తన లక్ష్యమన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవింపబడేలా కృషి చేస్తున్నానన్నారు. గత 15 నెలల కాలంలో నూజివీడు నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 6 కోట్ల రూపాయలను అందించామని, వారి వైద్యం ఖర్చు, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకొక్కరికి 2 లక్షల నుండి 8 లక్షల వరకు కూడా మంజూరు చేశామన్నారు. మరో 15 నుండి 20 కోట్ల రూపాయలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలు త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. వైద్యవిద్య పూర్తిచేసిన వైద్యవిద్యార్థులు అందుబాటులోకి వస్తే పేదప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు పిపిపి విధానంలో చెప్పడం కారణంగా ఫీజులు, అడ్మిషన్ కోటా నిబంధనల ప్రకారమే జరుగుతుందని, దీంట్లో ఎటువంటి మార్పు ఉందన్నారు. నూజివీడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని, అధికవర్షాల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాలను 27 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేపడుతున్నామని, , జాతీయ ఉపాధి హామీ పధకం ద్వారా 25 కోట్ల రూపాయలతో డ్రైన్లు, సిసి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. నూజివీడులో ఇన్డోర్ స్టేడియం ను పునర్నిర్మిస్తున్నామని, అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్ఎస్పి జలాలను నూజివీడు నియోజకవర్గానికి తీసుకువచ్చామన్నారు. నూజివీడు పట్టణంలో 65 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేశామని, మరో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. జాతీయ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులపై సుప్రీం కోర్ట్ లో కేసులున్నాయని, వాటిలో చింతలపూడి ఎత్తిపోతల పధకం నకు సంబందించి కేసులున్నాయన్నారు. కేవలం 76 కోట్ల రూపాయలు పెనాల్టీతో పరిష్కారమయ్యే అంశాన్ని, గత ప్రభుత్వ సమయంలో నిర్లక్ష్యం కారణంగా సుప్రీం కోర్ట్ లో కేసు నమోదు అయ్యిందన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణ జిల్లాలో విలీనంపై మంత్రుల సబ్ కమిటీ అధ్యయనం చేస్తోందని, ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దన్నని, ఈ విషయంలో కొందరు రాజకీయ దురుద్దేశ్యంతో బురద చల్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.
కార్యక్రమంలో నూజివీడు మునిసిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు, పట్టణ, మండల నాయకులు, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *