Breaking News

కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప, ఆ సామాజిక వర్గీయులు శనివారం కలిశారు. పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కురుబలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో నిలిపేలా కురుబలను ప్రోత్సహిస్తున్నారన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కురుబలకు అధిక ప్రాధాన్యమిచ్చారని, ఎంపీలుగా ఇద్దరిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించారని తెలిపారు. కేబినెట్ లో కూడా బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ బాధ్యతలు కురుబ సామాజిక వర్గానికి చెందిన తనకు అప్పగించారని తెలిపారు. ఈ పదవుల కేటాయింపే కురుబలపై సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. కురుబల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సవితను కురుబ సామాజిక వర్గీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కురబ సంక్షేమ సంఘ ప్రతినిధులు బెల్లెరెడ్డి ప్రసాద్, కార్యదర్శి మేజారి సదాశివ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *