Breaking News

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఒకేసారి పెంచడం చరిత్రాత్మకం నిర్ణయం

-దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అత్యధిక పెన్షన్లు పంపిణీలో ప్రథమ స్థానంలో ఉన్నాము.
-జిల్లాలో 2 లక్షల 60 వేల 765 మందికి 114.14 కోట్ల రూపాయలు పెన్షన్లదార్లకు పెన్షన్లు సొమ్ము పంపిణీ.
-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …

ఏలూరు/ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం – డాక్టరు బి.ఆర్.అంబేద్కర్, బుడ్డగూడెం కాలనీలలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ప్రతి గడపకు వెళ్ళి, వారి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు, గ్రామానికి ఇంకా అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకుని, లబ్దిదారులకు పెన్షన్లు సొమ్మును రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంయుక్తంగా అందజేశారు. ముందుగా బుడ్డగూడెం కాలనీ వద్ద బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రం మీద రూ 14 లక్షల కోట్ల అప్పులు భారం పెట్టినా, ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఓకేసారి పెన్షన్లు పెంచి, మూడు నెలలు ఏరియర్సుతో కలిపి అందజేసామన్నారు. ప్రతినెల 01వ తేదీ ఉదయాన్నే ప్రతి గడపకు వెళ్ళి పెన్షన్లు సొమ్మును పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారులు ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో ఆనందంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆశీస్సులు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్లు దారులకు పంపిణీ చేసే సొమ్ము ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువ అని, దేశంలోనే మన రాష్ట్రం అత్యధిక పెన్షన్లు పంపిణీలో ప్రథమస్థానంలో ఉన్నామన్నారు. 01వ తేదీనే నూటికినూరుశాతం పెన్షన్లు దారులకు పెన్షన్లు పంపిణీ చెయ్యడానికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రతినెల మొదటి రోజునే సామాజిక పెన్షన్లు దారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుకు కూడా జీతాలు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ 250 రూపాయలు మాత్రమే పెన్షన్లు సొమ్ము పెంచేవారని, మన ప్రజా ప్రభుత్వంలో విడతలు వారీ కాకుండా ఒకేసారి పెంచి మూడు నెలలు బకాయిలు కలిపి లబ్దిదారులకు అందజేశామని అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు జీతాలు పెంచమని మాట అటుంచి మాకు జీతాలు 01వ తారీఖున ఇవ్వండి మహా ప్రభో అనేవారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు.

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తున్నదని, సద్వినియోగం చేసుకుని మంచి ఆరోగ్యంతో సమాజంలో గౌరవంగా జీవించాలని అన్నారు. పింఛన్లను ఇంటింటికీ వెళ్ళి పంపిణీ చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఏరాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు అందజేయడం జరుగుచున్నదని, లబ్ధిదారులు భవిష్యత్తు అవసరాలు కోసం కొంతపొదుపు చేసుకోవాలని సూచించారు. 01వ తేదీనే నూరుశాతం పెన్షన్లు దారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, అనివార్య కారణాలచేత 1వ తేదీన తీసుకొని పెన్షన్లుదారులు 03వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 5175 మంది సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, యంపిడివో బి.భార్గవి, డిప్యూటీ తహశీల్దారు జి.పవన్ కుమార్, మండల వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, వివిధరకాలు సామాజిక పింఛన్లుదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *