Breaking News

నగరంలో ఆదివాసీ శంఖారావం ముగింపు కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఆదివాసీ శంఖారావం ముగింపు కార్యక్రమం సంధర్భంగా శనివారం గాంధీనగర్, ప్రెస్ క్లబ్ నందు జరిగిన ఆదివాసి మేధావుల సదస్సు నిర్వహించారు. అనంతరం బిర్సాముండ జయంతిని పురస్కరించుకొని నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా అనుముల వంశీకృష్ణ మాట్లాడుతూ 679 మండలాలు కలిగిన ఆంధ్రప్రదేశ్లో కేవలం 44 మండలాలే షెడ్యూల్డ్ ప్రాంతమని, చట్ట సభలలో రిజర్వేషన్ ప్రవేశపెట్టిన 1952 నుండి 26 జిల్లాలకు గాను కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు మూడు జిల్లాల్లోని గిరిజనులు మాత్రమే రాజకీయ రిజర్వేషను అనుభవిస్తున్నారన్నారు. యన్ టి యఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ మాట్లాడుతూచట్టస భల్లో, నామినేటెడ్ పదవులలో ప్రాతినిధ్యం లేని తెగలు, కులాల మందరం ఏకమౌదాం. శాసన మండలి, రాజ్యసభలలో రిజర్వేషన్లు ఏర్పాటుచేసే దాకా ప్రభుత్వ పాలనలో అణగారిన వర్గాలకు భాగస్వామ్యం కల్పించేదాకా రాజీలేని పోరాటం పోరాటం చేద్దామని, చేద్దా గొంతెత్తి నినదిద్దామని పిలుపునిచ్చారు. ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు యన్. మోహన్ కుమార్ ధర్మ మాట్లాడుతూ 34 గిరిజన తెగలకు దక్కాల్సిన రిజర్వేషన్, 44 మండలాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతంలో 7 శాసనసభ, ఒక యం.పి. స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారని, వాటితో పాటు గిరిజన సంక్షేమశాఖ మంత్రి, గిరిజన సలహా మండలి చైర్మన్, ఏస్టీ కార్పొరే షన్ ఛైర్మన్, యస్టీ కమిషన్ చైర్మన్, గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, కమీషన్ సభ్యులు, కాఫీ బోర్డు సభ్యులు, సినిమాటోగ్రఫీ సెన్సార్ బోర్డు సభ్యులు, ఫుడ్ కార్పోరేషన్ డైరెక్టర్లు, వివిధ రాజకీయ పార్టీలలో ముఖ్యమైన పదవులన్నీ షెడ్యుల్డ్ ప్రాంత గిరిజనులతో నింపేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *