-ఏపి బార్ కౌన్సిల్ ఎన్నికలకు ” ఆలా ” కూటమి సిద్దం ..
-ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయవాదులకు ప్రత్యేక భద్రత చట్టం , ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అమలు చేయాలని ” ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ” ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో “ఆలా” అధ్యక్షులు ఎమ్. రాజారామ్, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ సంయుక్తంగా కోరారు .
చట్టాలపై గౌరవం, న్యాయవ్యవస్థల పట్ల భయం లేకుండా రోజు రోజుకు నేర వ్యవస్థ బలంగా పెరుగుతుంది. ఈ కారణాలతో న్యాయవాదులకు భద్రత లేకుండా పోతుంది. న్యాయవాద కుటుంబాలకు రక్షణ లేకపోతుంది. వృత్తి ధర్మగా విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై విచక్షణా రహితంగా దాడులు జరుగుతున్నాయి . అనేక ఘటనల్లో సంఘ విద్రోహులు న్యాయవాదులను పాశవికంగా హత్యలు చేస్తున్నారు . న్యాయవాదుల ఆత్మస్టైర్యాన్ని భయపెట్టే విధంగా రెచ్చిపోతున్నారు . న్యాయవాదులకు కష్టమొచ్చినా అసాంఘిక శక్తులు భయబ్రాంతులకు గురి చేస్తున్నా న్యాయవాదుల మోర, వారి కుటింబికుల ఆర్తనాదాలు వినే యంత్రాంగం పరిస్థితులు నేడు కానరావటం లేదు . కొన్ని పరిస్థితుల్లో న్యాయవాదులు ఇచ్చే పిర్యాదులను సైతం పట్టించుకోవటం లేదు. న్యాయవాదుల ఆత్మ స్టైర్యాన్ని బెదిరించుటకు ఇచ్చే కొన్ని కిరాయి ఫిర్యాదులకు స్పందిస్తున్న కొంతమంది పోలీసులు న్యాయవాదులను ఆకారణంగా వేదిస్తున్నారు . కొన్ని కొన్ని పరిస్థితుల్లో న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తు మానసికంగా వేడిస్తున్నారు .
న్యాయవాదులకు ఏర్పడే కష్టాలు , అవాంతరాలు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు మేము వున్నాము. అండగా నిలబడతాం అనే న్యాయవాద వ్యవస్థ ప్రస్తుతం న్యాయవాదులకు లేకపోవటం బాదాకరం . న్యాయవాదులకు, న్యాయవాద వృత్తికి ఒక అండగా, భరోసాగా వుండే న్యాయ వ్యవస్థను న్యాయవాదుల దరికి చేర్చటమే లక్ష్యంగా “ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ” అంతిమ లక్ష్యం అని తెలిపారు .
“ఆలా” అధ్యక్షులు ఎమ్. వి రాజారామ్, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ సారథ్యంలో త్వరలో జరగబోవు ఆంధ్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు కొంతమంది ఆదర్శవంతమైన సమర్థులను ” ఆలా ” తరుపున పోటిలో నిలవటానికి ప్యానల్ ను సిద్దం చేస్తున్నట్టు “ఆలా” నుండి అధికారికంగా తెలిపారు .
న్యాయవాద వృత్తి పూర్తిగా ఉపాధి మార్గం కాదు. లాభసాటి సంస్థ కాదు.అనేక ప్రజా సమస్యలు,రాష్ట్ర సమస్యలు, జాతీయ సమస్యలకు మేము సైతం అంటు త్యాగాలకు సిద్దపడే వారు ఎవరైనా వున్నారు అంటే అది ముందుగా న్యాయవాదులే నని గుర్తుంచుకోవాళి . న్యాయవాదులకు ఒక భద్రత , భరోసాగా నిలబడే రకక్షణాలయం బార్ కౌన్సిల్ అని బావించాలి . న్యాయవాదుల ప్రధాన సమస్యలను , ఆర్ధిక స్థితి గతులను పరిశీలించకుండానే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటి చేయు అభ్యర్థులు 1 లక్షా 25 వేలు దారావత్తు చెల్లించాలని జారి కాబడిన ఆదేశాలు న్యాయవాదులహక్కులను, స్వేచ్ఛను హరించే విధంగా వున్నాయని ” ఆలా ” ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది ఎమ్.వి. రాజారామ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో 2000/- రుసుమును మాత్రమే చెల్లించే విధంగా ఆదేశాలను జారిచేయమని వాజ్యం దాఖలు చేసారు .
న్యాయవాదుల భద్రత – సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆవిర్బవించిన “ఆలా ” ప్యానల్ నుండి త్వరలో జరగబోవు బార్ కౌన్సిల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని యావత్ న్యాయవాదులను వారు కోరారు .
న్యాయవాదుల సమస్య లపై “ఆలా ” ప్రధాన లక్ష్యాలు ..
(1) న్యాయవాదులకు ప్రత్యేక భద్రతా చట్టం యుద్ధ ప్రాతి ప్రదికన సాధిస్తాం .
(2) న్యాయవాదులకు – న్యాయవాద కుటుంబ సభ్యులకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య సేవలను సాధిస్తాం.
(3) న్యాయవాదులకు నామమాత్రపు ప్రభుత్వ ధరకే ఇంటి స్థలాల కేటాయింపును సాధిస్తాం .
(4) న్యాయవాదుల వాహనాలకు ఉచితంగా టోల్ ప్లాజా రుసుమును సాధిస్తాం.
(5) న్యాయవాదుల అరెస్ట్ కు ఖచ్చితంగా సంబంధిత న్యాయమూర్తులు వారి ఆదేశాలు తప్పనిసరి చేస్తు అమలును సాధిస్తాం .
(6)ప్రైవేట్ – కార్పొరేట్ విద్యా సంస్థల్లో న్యాయవాదుల బిడ్డలకు తప్పనిసరిగా 50% ఫీజు రాయితీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం నుండి అమలును సాధిస్తాం.
(7) న్యాయవాదులకు ఋణ మంజూరు ఇవ్వం అనే నిబంధనను రద్దు చేయించి న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం .
(8) న్యాయవాదులపై అక్రమ కేసులు భనాయించే యంత్రాంగం పై చట్టపరంగా గుణపాఠం చెబుతాం. భాధిత న్యాయవాదులకు రక్షణగా నిలుస్తాం .
(9) పోలీస్ స్టేషన్స్ లో అమలు చేస్తున్న యు /ఎస్ . 41 సి. ఆర్. పి. సి మంజూరును న్యాయవాది సమక్షంలో మాత్రమే అమలు చేసే విధంగా ప్రభుత్వం నుండి అనుమతిని సాధిస్తాం. తద్వారా స్థానిక న్యాయవాదుల ఉపాధి మార్గాలకు బాసటగా నిలుస్తాం.
(10) ఆంధ్రప్రదేశ్ లో గల అన్ని జిల్లా కోర్టుల సముదాయాలలో అదునాతన లైబ్రరీ సౌకర్య అమలును సాధిస్తాం.
(11) న్యాయవాదుల సౌలభ్యం కొరకు పూర్తి స్థాయి సౌకర్యవంతమైన బార్ అసోసియేషన్ నిర్మాణ అవసరాలకు ప్రత్యేక నిధులు సాధిస్తాం. తోడ్పాటుకు అండగా నిలుస్తాం ..
2006 అడ్వకేట్ వెల్ఫేర్ చట్టం సెక్షన్ 15 సవరణ జరిపించి వయస్సు రహితంగా న్యాయవాదులు అందరు వెల్ఫేర్ ఫండ్ పొందేందుకు కృషి చేస్తాం . డెత్ బెనిఫిట్ రాయితీని నేరుగా న్యాయవాది కుటుంబ సభ్యులకు అందచేసే విధంగా మెరుగైన విధానాలను అమలు చేస్తాం . ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఏ. డబ్ల్యూ. ఎఫ్. యక్ట్ 2(f) ఆఫ్ బి. సి. ఐ. యక్ట్ విధానాన్ని రద్దు చేయించుటకు కృషి చేసి న్యాయవాద కుటుంబాలకు , న్యాయవాదులకు రక్షణగా నిలుస్తాం .
“ఆలా” తోనే న్యాయవాదులకు భద్రత , సంక్షేమం అని యావత్ న్యాయవాదులు బావించి న్యాయవాదులు అందరు విప్లవాత్మకమైన చైతన్యంతో ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ప్రోత్సహించిన ఎమ్. వి. రాజారామ్ గారి ప్యానల్ ను తమ తమ మొదటి ఓటు ప్రాదాన్యాతతో గెలిపించి మార్పుకు, ప్రక్షాళణకు కృషి చేయాలని యావత్ న్యాయవాదులను ” ఆలా ” అధ్యక్షులు ఎమ్. వి రాజారామ్ , ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ లు సంయుక్తం కోరుతున్నారు .
ముందుగా ” ఆలా ” అధ్యక్షులు కీర్తి. శే. ఎస్. ఆర్. సంకు చిత్రపటానికి పుష్ప గుచ్చాలను సమర్పించి గౌరవ అంజలి ఘటించారు . అనంతరం న్యాయవాదుల భద్రత చట్టం కోసం సంకు చేసిన కృషిని న్యాయవాదులు కొనియాడారు. సంకు లేని లోటును తలచుకుని ఆలా సభ్యులు కన్నీటి పర్యాంతం చెందారు ..
“ఆలా” తరుపున త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటి చేయడలచుకున్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాం అని తెలిపారు .
ఈ విలేకరుల సమావేశంలో సర్వశ్రీ న్యాయవాదులు వి. ఎన్. ఎస్. ఎల్ సుధాకర్ , ఎమ్. వి మాధురిమ, జె. సత్యనారాయణ , టి. రాధమ్మ , దూడల త్రినాద్, పొన్నా రాజు , సాదిక్ హుస్సేన్ , పి. రేవతి, బి. నాగమణి, ఎన్. సతీష్ కుమార్, సి. రాఘవ , కె. యెమున , గోపాల్ కృష్ణ , ఎమ్. ఆది , బి. గోపిరెడ్డి, బాను ప్రకాష్, బి. సతీష్, రేవంత్ , తీర్తంకర, బాజీ , మాకిరెడ్డి మనోజ్, ఆళ్ళ శ్రీహరి, కె. రామకృష్ణ రెడ్డి, ఏ. విజయ్ కృష్ణ , బి. నవీన్ కృష్ణ సాయి, బాను ప్రసాద్, కె. అజిత్, సింధు, కందికట్టు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News