విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ పేషెంట్స్ కి సంబంధిత రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్న డా:గోరిపర్తి శశిధర్, స్థానిక సూర్యారావుపేట జగడం వారి వీధి లో అర్చన హాస్పిటల్ నందు నవంబర్ 23 ఆదివారం గోరిపర్తి పరంధామయ్య జ్ఞాపకార్థం ప్రముఖ నేప్రలజీ డాక్టర్ గోరిపర్తి శశిధర్ ఉచిత మెగా వైద్య శిబిరం భారీగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ గోరిపర్తి శశిధర్ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తక్కువ ధరకి అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగిందని తన తండ్రి అయిన గోరిపర్తి పరంధామయ్య జ్ఞాపకార్థం ఈ మెడికల్ క్యాంపుని గత రెండు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. వైద్యరంగంలో 20 సంవత్సరాల అనుభవంతో ప్రతి పేద రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే అర్చన హాస్పిటల్స్ లక్ష్యమని అన్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహిస్తామని ఈసీజీ లో గుండెకి సంబంధించిన ఇబ్బందులు,శాస్త్ర చికిత్సలు అవసరమైతే ఇతర హార్ట్ హాస్పిటల్లో ఉచితంగా, డిస్కౌంట్ల పైన, వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ వైద్య శిబిరంలో మూడు వేల రూపాయల విలువైన రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎముకలకు సంబంధించిన బీఎండీ పరీక్షలు నిర్వహించి ఎముకుల పట్టుత్వం తక్కువగా ఉన్నవారికి ఆస్ట్రోపోరాసిస్ ఇంజక్షన్ 50 శాతం తక్కువ ధరకి అందిస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరానికి సహాయ సహకారాలు అందించిన ఫార్మా ఇండస్ట్రీ కి,మా మిత్ర వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ మెడికల్ క్యాంపులో అన్ని రకాల మందులు రాయితీపై అందజేస్తున్నామని తెలిపారు.
కాస్మోటాలజీ,చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ అర్చన మాధవి మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపులో ఫిజీషియన్, నెఫ్రాలజీ డెర్మటాలజీ,యూరాలజీ, విభాగాల్లో ఫ్రీ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నామని రెండు వందల మంది వరకు ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల విభాగాల డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News