Breaking News

వైయస్సార్ ఆసరాతో మహిళలకు ఆర్థిక భరోసా… : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు అమలు చేస్తూ ప్రతి పధకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం చైతన్య స్కూల్ గ్రౌండ్లో జరిగిన వైయస్సార్ ఆసరా రెండవ విడత నగదు మంజూరు అయిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 2,6 డివిజిన్ల లబ్ధిదారులతో నిర్వహించిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా డివిజన్లలో 307 గ్రూపులకు మంజూరు అయిన దాదాపు 2కోట్ల 35లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడానికి, వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయడానికి జగన్  వైయస్సార్ ఆసరా ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తూ స్వయం ఉపాధి కల్పన చేస్తున్నారు అని,అదేవిధంగా అమ్మఒడి, చేయూత ఇలా ప్రతి పధకంలో నేరుగా మహిళలకు లబ్ది చేకూరేలా అమలు చేయడంతో పాటు ఇళ్ల పట్టాలు కూడా వారి పేరు మీదనే ఇస్తూ అసలైన మహిళ పక్షపతిగా నిలిచారని కొనియాడారు. మహిళలలో రోజురోజుకు ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి,ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి అయితే ఇక వారికి రాజకీయ భవిష్యత్ ఉండదు అనే దుర్బుద్ధితో ప్రతిపక్ష పార్టీలు కోర్టులు ద్వారా ఇళ్ల నిర్మాణం అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన పేదవారి సొంతింటి కలను జగన్ గారు నెరవేరిస్తారని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా పై స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 2వ డివిజన్ కార్పొరేటర్ అంబలపూడి నిర్మలా కుమారి, 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమరనాథ్, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చెన్నంశెట్టి రవి,వైసీపీ నాయుకులు చిన్నబాబు, కోటినాగులు, ప్రభు, అభినాయుడు, గల్లా రవి, హుస్సేన్, మోయిన్ మరియు రెండు డివిజన్ల నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 11న జరగబోయే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం కర్నూలు వారి, వడ్డెర సంక్షేమ సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *