Breaking News

ముంబైలో ఘనంగా ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ (ISGL) కార్యక్రమం

-ISGL కర్టెన్ రైజర్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మండిపల్లి
-పాల్గొన్న బాలీవుడ్ సినీ నటులు అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్
-ఫైనల్స్ వైజాగ్ లో నిర్వహించనున్నట్లు నిర్వాహకుల వెల్లడి బాలీవుడ్ నటులను ఆహ్వానించిన మంత్రి మండిపల్లి

ముంబాయి, నేటి పత్రిక ప్రజావార్త :
ముంబైలోని గ్రాండ్ హయత్‌లో నిర్వహించిన ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ (ISGL) కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ స్పోర్ట్స్ రంగంలో భారతదేశానికి ఉన్న అపార అవకాశాలను ఆయన వివరించారు. యువత ప్రతిభను వెలికితీసేందుకు, క్రీడా రంగాన్ని డిజిటల్ దిశగా విస్తరించేందుకు ఇటువంటి లీగ్‌లు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్ రణబీర్ కపూర్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లీగ్ ఫైనల్స్ ను విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బాలీవుడ్ నటులను మంత్రి మండిపల్లి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఈ-స్పోర్ట్స్ అభివృద్ధికి ఇది మరింత ఊతమిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *