జిల్లా మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
International Women’s Day సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు తూర్పుగోదావరి జిల్లా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా విభాగం చైర్‌పర్సన్ శ్రీమతి ఎం. నాగలక్ష్మి వందన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై ఆమె ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో ఏపీజేఏసీ అమరావతి నాయకులు, మహిళా విభాగం సభ్యులు, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మహిళల ఐక్యత, సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *