Breaking News

జిల్లాలో వైఎస్సార్ జగనన్న గృహనిర్మాణాలు వేగవంతం చెయ్యాలి… : కలెక్టరు. జె. నివాస్

-జగనన్నశాశ్విత గృహ హక్కు పథకం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి…
-ఆర్బీకేలు, సచివాలయ భవనాలు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలి…
-కోవిడ్ కట్టడికి మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు నూరు శాతం వ్యాక్సినేషన్ అందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్నశాశ్విత గృహ హక్కు పథకం కింద గతంలో వివిధ గృహనిర్మాణ పథకాలు ద్వారా నిర్మించిన ఇళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం యంపిడిఓలు, తహాశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఇంజనీర్లు, డ్వామా ఏపిఓలు, ఆర్‌డబ్ల్యుఎస్,ట్రాన్స్ కో తదితర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, సచివాలయ సర్వీసులు, ఇళ్ల నిర్మాణం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టరు వీసీ ద్వారా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో 1983 సంవత్సరం నుంచి 2005 వరకు వివిధ గృహ నిర్మాణాల పథకం కింద నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న గృహ లబ్దిదారుల ఇళ్లను రిజిస్ట్రషన్ చేసి ఇంటిపై సంపూర్ణమైన హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ దిశగా మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా పథకాల్లో నిర్మించిన గృహాలను గుర్తించాలన్నారు. ఆ గృహంలో లబ్దిదారుడే నివాసం ఉంటున్నాడా, లేక వారసులు ఉంటున్నారా, లేదా ఇతరులకు విక్రయిస్తే, కొనుగోలు చేసినవారు ఉంటున్నారా అనేది పరిశీలించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా ప్రస్తుతం నివాసం ఉంటున్న వ్యక్తికే ఇంటిపై పూర్తి హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నరు. ఈ ప్రక్రియను డిసెంబర్, మూడోవారం నాటికి పూర్తి చేయాలన్నారు. జగనన్నశాశ్విత గృహ హక్కు పథకంపై ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. కోవిడ్ నియంత్రణే లక్ష్యంగా ప్రతి ఒక్కరికీ రెండు మోతాదులు వ్యాక్సిన్ అందించాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆదిశగా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ప్రత్యేక మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు ద్వారా ప్రజలకు వ్యాక్సిన్ అందించాలన్నారు. ఆర్బీకే భవనాలు, సచివాలయ భవానాలు రూఫ్ లెవెల్ ఉన్న వాటిని స్లాబ్ లెవెల్ తీసుకువెళ్ళాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న గృహనిర్మాణాలు వేగవంతం చెయ్యాలన్నారు. ఇంకా పనులు ప్రారంభించని చోట్ల త్వరితగతిన ప్రారంభించాలన్నారు. గృహనిర్మాణ లేవుట్లలో లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి మండల కేంద్రంలోను గ్రామ స్థాయిలోను గృహనిర్మాణాలకు సంబందించిన ఇసుక,ఐరన్, సిమ్మెంట్ నిల్వలను సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి వారం 500 ఇళ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాన్నారు. ప్రతి శుక్రవారం మండల స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ప్రగతి సాధించాలన్నారు. మండల స్థాయి అధికారులు, మండల ప్రత్యేకాధికారులు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. లబ్దిదారుల గృహనిర్మాణంలో అధికారులు, సిబ్బంది నిర్థేశించిన లక్ష్యాలు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు జె. నివాస్ హెచ్చరించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా.కె.మాధవిలత,హౌసింగ్ జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ,జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె.మోహన్ కుమార్,జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్,హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *